25 ఫిబ్ర, 2012

మహేష్ బాబుకు అల్లు అరవింద్ బంపర్ ఆఫర్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్ లో నెం.1 స్థానంలో కొనసాగుతున్న హీరో. దూకుడు, బిజినెస్ మేన్ రికార్డు స్థాయి హిట్ కావడం, ఈరెండు సినిమాలు కలిసి కోట్ల రూపాయాల మార్కెట్ చేశాయి. ఈ నేపథ్యంలో మెగా నిర్మాత అల్లు అరవింద్ చూపులు మహేష్ బాబుపై పడ్డాయి. ఫామ్ లో ఉన్న హీరోలు, హీరోయిన్లతో కాంట్రాక్టు కుదుర్చుకుని వరుస సినిమాలు చేసి లాభాలు పొందడంలో ఆరి తేరిన అల్లు అరవింద్ మహేష్ బాబును కూడా వరుస సినిమాల్లో బుక్ చేసుకునేందుకు భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారని సమాచారం. ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న వివరాల ప్రకారం ఇటీవల అల్లు అరవింద్ మహేష్ బాబుతో సంప్రదింపులు జరిపారని, మూడు సినిమాలకు కాంట్రాక్టు కుదుర్చుకుందామని ప్రపోజ్ చేశాడని అంటున్నారు. 

కథ, డైరెక్టర్లను ఎంచుకునే ఫ్రీడం కూడా మహేష్ బాబుకే ఇస్తూ ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లు చెల్లించేందుకు ఆఫర్ చేశాడని, అయితే మహేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఏ విషయం అనేది త్వరలోనే తేలుతుందని మహేష్ బాబు సన్నిహితుల నుంచి వినిపిస్తున్న సమాచారం. 

ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన సమంత నటిస్తోంది.