20 ఫిబ్ర, 2012

‘మనిషికన్నా తెలివైన కంప్యూటర్’: స్విడెన్ శాస్త్రవేత్తల అద్భుతం


 కంప్యూటర్లు మనుషులతో పోటీపడగలవా..?, టెక్నాలజీ మానవ మేధస్సును జయించగలదా..? ఈ అంశాల పై అనేక ఊహాగానాలు, ఆసక్తికర చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో స్విడెన్‌కు చెందిన గుటన్‌బర్గ్ వర్శిటీ శాస్ర్తవేత్తలు ఆశ్చర్యకర అంశాలను వెల్లడించారు. ప్రపంచంలోని 96శాతం మందికంటే తెలివైన కంప్యూటర్‌ను తాము సృష్టించగలిగామని ప్రకటించారు. ఈ నిపుణుల బృందం అభివృద్ధి చేసిన కంప్యూటర్ ‘జీనియస్’ మనిషిలా ఆలోచించడమే కాకుండా విషయాలను తర్కించగలదట!
ఐక్యూ టెస్టులో జీనియస్ 150 మార్కులు(మనిషి సగటు స్కోరు 100) సాధించగలదని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో మనిషి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన గణితశాస్త్ర మోడళ్లను అనుసరించామని, ‘జీనియస్’ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని వారు చెప్పారు