12 ఫిబ్ర, 2012

రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ డేట్ ఫిక్స్

రామ్ చరణ్ ..బాలీవుడ్ హిట్ జంజీర్ తో అక్కడ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఏప్రియల్ 20న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని దర్శకుడు అపూర్వ లఖియా మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేసారు. ఆయన మాట్లాడుతూ...జంజీర్ రీమేక్ పై నేను ఏప్రియల్ 20 నుంచి పనిచేస్తాను. వచ్చే వారం ధాయ్ ల్యాండ్ కి ఓ నిమిత్తం వెళ్తున్నాను అన్నారు. ఇక అపూర్వ లఖియా గతంలో షూట్ ఎట్ లోఖండ్ వాలా చిత్రం డైరక్ట్ చేసారు. అది చూసే రామ్ చరణ్ ఆయన దర్శకత్వంలో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఇక అమితాబ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలో రామ్ చరణ్ కనిపించటం తనకు ఆనందంగా ఉందని గతంలో తెలియచేసారు. అలాగే ఈ చిత్రం షూటింగ్ కొంత ముంబై లోనూ మిగిలింగి రాజస్ధాన్ పరిశర ప్రాంతాల్లోనూ,కొన్ని సెట్స్ లోనూ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం స్క్రిప్టుని ఈ కాలనికి తగినట్లు తిరగ రాసినట్లు చెప్తున్నారు.