21 ఫిబ్ర, 2012

గెలవడం కష్టమన్న కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్: తెలంగాణ వాదం బలంగా ఉందని, స్టేషన్ ఘన్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం కష్టమని ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పారు. వరంగల్ జిల్లా పార్టీ నేతతో ముఖ్యమంత్రి సమావేశం ముగిసింది. స్టేషన్ ఘన్ పూర్ అభ్యర్థి విషయమై చర్చించారు. ఎన్నికల ఫండ్ అధికంగా ఇస్తే గట్టి పోటీ ఇవ్వగలమని నేతలు అన్నారు. నేతలందరూ పార్టీ అభ్యర్థి కోసం కలసికట్టుగా కృషి చేయాలని సిఎం వారికి చెప్పారు.

ఇదిలా ఉండగా, ఈ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ముగ్గురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జెడ్సన్, ఎంపి రాజయ్య కుమారుడు అనిల్, ప్రతాప్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.