28 ఫిబ్ర, 2012

లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో జెనీలియా...

హీరోయిన్ జెనీలియా లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. వరుసగా నాలుగు భాషాల్లో తను నటించిన సినిమాలు హిట్ కావడంతో జెన్నీ ఈ ఘనత సాధించింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో జెనీలియా నటించిన సినిమాలు వరుసగా విడుదలై విజయం సాధించాయి. 

జెనీలియా ఇటీవల తన కోస్టార్ రితే్ష్ దేశ్ ముఖ్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా అమ్మడు హీరోయిన్ రాణిస్తోంది. జెనీలియా తన భర్త రితేష్ తో కలిసి నటించిన ‘తేరే నాల్ లవ్ హోగయా’ చిత్రం తాజాగా విడుదలై మంచి విజయం సాధించింది. ఇక్కడ గమనించి దగ్గ మరో విషయం ఏమిటంటే...పెళ్లిని హిందూ, క్రిష్టియన్ సంప్రదాయాల ప్రకారం చేసుకున్న జెన్నీ, పెళ్లి తర్వాత తన సర్ నేమ్ కూడా మార్చుకుంది. ఇప్పటి వరకు జెనీలియా డిసౌజాగా ఉన్న ఆమె పేరు, పెళ్లి తర్వాత జెనీలియా దేశ్ ముఖ్ గా మారింది. 

జెనీలియా ఇంకా ఈ సంవత్సరం ఇట్స్ మై లైఫ్, నా ఇష్టం, రాక్ ద శాది, బ్లడీ పాకి, హాక్ యా క్రూక్ చిత్రాల్లో నటిస్తోంది.