27 ఫిబ్ర, 2012

కోరికలు చంపుకుని..! నాగార్జునలో మార్పు...

సాధారణ వ్యక్తులకు, దైవ చింతనలో ఉండే వ్యక్తుల ప్రవర్తనలో, అలవాట్లలో చాలా తేడాలు ఉంటాయి. దేవుడి దీక్షలో ఉన్నప్పుడు కొన్ని అలవాట్లను త్యాగం చేయక తప్పదు. మాంసాహార ప్రియులు, ఆ...అలవాట్లు ఉన్నవారు వాటికి దూరంగా, జిహ్వ చాపల్యాన్ని, కోరికలను చంపుకుని అణకువగా ఉండక తప్పదు. తాజాగా నాగార్జున కూడా ఇలానే ఉంటున్నాడు. ప్రస్తుతం షిరిడి సాయి షూటింగులో ఉన్న నాగార్జున గ్లామర్‌, ఫ్యాషన్‌తో పాటు, చాలా అలవాట్లకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల ఓ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ షిరిడి సాయి పాత్రను చేయడం కోసం చాలా నిష్టగా, పవిత్రంగా ఉంటున్నానని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి తాను చాలా అలవాట్లకు దూరంగా ఉంటున్నానని చెప్పకనే చెప్పారు నాగార్జున.

షిరిడి సాయి చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తి రస చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో ఈ చిత్రంమైనా మంచి అంచనాలున్నాయి. షిరిడిసాయి చిత్రం ప్రస్తుతం కర్నాటకలో జరుగుతోంది. కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చుతున్నారు.