28 ఫిబ్ర, 2012

వైభవంగా శ్రీలక్ష్మీనర్సింహుని బ్రహ్మోత్సవాలు

ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినర్సింహుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాల్గోరోజు స్వామి వారు మురళీకృష్ణునిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామి వారు తిరువీధుల్లో ఊరేగారు. 

స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్న సంగీత, సాహిత్య కచేరిలు భక్తులను అలరిస్తున్నాయి.