14 ఫిబ్ర, 2012

పవన్, పూరీ చిత్రం లీకెడ్ డైలాగులు

పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. మొన్న శుక్రవారం తన ట్విట్టర్ ద్వారా ఈ చిత్రానికి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అనే టైటిల్ ఖారారు చేసినట్లు పూరీ వెల్లడించారు. అయ్యితే అప్పుడే అభిమానులు కొందరు ఈ చిత్రంలో డైలాగులు లీకయ్యాయంటూ కొన్ని డైలాగులు తయారు చేసి నెట్ లో ప్రచారం చేస్తున్నారు. ఆ డైలాగులులలో కొన్ని ...

1.విలన్ గట్టిగా అరుస్తూ...రాంబాబూ..
పవన్ ..చుప్ బే సాలే..రాముడ్ని తలుచుకో..పుణ్యం వస్తుంది...కానీ ఈ రాంబాబుని తలుచుకోకు నీ చావు కబురు బ్రేకింగ్ న్యూస్ గా వస్తుంది. 

2.పవన్ తో ఓ రౌడీ...ఈ రాంబాబుకి రెండే తెలుసు ఒకటి న్యూస్ బ్రేక్ చెయ్యడం...రెండు నీ బోన్స్ బ్రేక్ చెయ్యడం 

3.నేను క్యాజువల్ గా కొట్టాను కాబట్టి క్యాజువల్టీలో అయ్యిన ఉన్నారు...అదే కసిగా కొట్టి ఉంటే కాటికి పోయేవారు 

4.రాంబాబు బ్యాండ్ వేయడం స్టార్ట్ చేస్తే.. బాడీ మొత్తం బ్యాండేజ్ తో నిండిపోతుంది..

5.రాంగ్ టైమ్ లో రాంబాబుని గెలుక్కున్నావురా... ఇంక నీ బాబు వచ్చిన నీ చావుని ఆపలేరు.

ఇలాంటి కొన్ని ప్రాసలతో కూడిన డైలాగులతో వీటిని తయారు చేసి నెట్ లో వదిలారు. కొందరు పవన్ ఫ్యాన్స్ వీటిని చూసి నవ్వుకుంటూంటే.. మరికొందరు నిజమే అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నాడు. మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.