23 ఫిబ్ర, 2012

'మిస్టర్ నోకియా'కు నోకియా కంపెనీ ట్విస్ట్

మంచు మనోజ్ తాజా చిత్రం "మిస్టర్ నోకియా"త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి టైటిల్ సమస్య వచ్చిందని సమాచారం. నోకియా కంపెనీ వారు అబ్జెక్షన్ చెప్పటంతో టైటిల్ ని ఛేంజి చేసారని తెలుస్తోంది. ఇప్పుడా టైటిల్ ని మిస్టర్ నూకయ్య గా మార్చారని చెప్తున్నారు. ఇక నో కాప్షన్..ఓన్లీ యాక్షన్ టైటిల్ తో రెడీ అవుతున్న ఈ చిత్రంలో సనాఖాన్,కీర్తి ఖర్బందా హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ చిత్రంలో మనోజ్ ఓ దొంగగా కనిపించనించనున్నాడు. సెల్ ఫోన్ లు మాత్రమే దొంగతనం చేసే అతన్ని మిస్టర్ నోకియా అని పిలుస్తూంటారు. అలా అనుకోకుండా చేసిన దొంగతనంతో హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆమె సెల్ పోన్ దొంగతనం చేసిన తర్వాత ఆమెకు ఎట్రాక్ట్ అయ్యి ఆమెపై ప్రేమను పెంచుకుంటాడు. మరో ప్రక్క అతను విలన్ సెల్ ను కూడా దొంగతనం చేస్తాడు. అక్కడ నుంచి అతని జీవితం రకరకాల మలుపులు తిరుగుతుంది. అంటే ఒక సెల్ ఫోన్ అతని జీవితంలో ఆనందాన్ని తెస్తే. మరో సెల్ ఫోన్ అతని జీవితంలో ట్విస్ట్ లు తెస్తుంది. 

ఇప్పటికే యవన్ శంకర్ రాజా అందించిన ఆడియో విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. పిల్ల జమీందార్ నిర్మాత డిఎస్ రావు ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో నిర్మించారు. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రానికి అని కన్నెగాని దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మనోజ్ సినీ కెరీర్లోనే ఈ సినిమా అతిపెద్ద రిలీజ్‌గా నిలవబోతోంది. 400లకు పైగా థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘మిస్టర్ నోకియా’ చిత్రం షూటింగ్ పార్టు పూర్తయింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సినిమాటోగ్రఫీ బి. రాజశేఖర్, నిర్మాత: డిఎస్ రావు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆని కన్నెగాని.