14 ఫిబ్ర, 2012

లవ్ ప్రపోజ్ చేయటానికి ఐదు సూత్రాలు

ఎన్నాళ్లుగానో మనసులో దాచుకున్న ప్రేమను వ్యక్తం చేసే రోజు. వాలంటైన్స్ డే రోజున లవ్ ప్రపోజ్ చేయడం మిస్సయితే... ప్రేమికులకు ఇది ఊహించడానికి కష్టమే. మిగతా రోజుల్లో లవ్ ప్రపోజ్ చేసే వీలున్నా... ఎంతమంది ఆ ధైర్యం చేయగలరు అనేది సందేహమే. మరి ఈ రొమాంటిక్ డే నాడు ప్రేయసితో ఎలా నడుచుకోవాలి అనేదానికి టాప్ ఫైవ్ సీక్రేట్ ఇప్పడు చూద్దాం.... 

చేయాల్సిన 5 అంశాలు 
1. లవ్ ప్రపోజ్ చేయడానికి సరైన ప్లాన్ 
2. రొమాంటిక్ లవ్ లెటర్ రెడీ చేయాలి
3. ప్రియురాలితో కలిసి విందు చేయడం
4. లాంగ్ డ్రైవ్‌కు వెళ్లొచ్చు 
5. డేని కలర్‌ఫుల్‌గా మార్చుకోవాలి

ప్రేయసికి లవ్ ప్రపోజ్ చేయబోతున్నాననే ఆలోచన ప్రియుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మోకాళ్లపై వాలి... ప్రేయసి చేతిని పట్టుకుని పంచభూతాల సాక్షిగా... ఐలవ్‌యూ అని చెప్పే అనుభూతి జీవితంలో మరిచిపోలేనిది. అందుకే ఈ రొమాంటిక్ టైంను ఎలా యూజ్ చేసుకోవాలా అని లవర్స్ ముందుగానే ప్లాన్ చేస్తారు. 

ఎందుకంటే లవ్ ప్రపోజ్ చేసిన రోజు జీవితాంతం గుర్తుండి పోతుంది కూడా. ఇక ప్రేయసి మనసు దోచుకోడానికి అతిముఖ్యమైంది లేఖాస్త్రం. అదే ప్రేమ లేఖ. ఈ కార్డ్స్, మొబైల్ మెసేజెస్ ఎన్ని వచ్చినా... ఇప్పటికీ లవ్ లెటర్స్‌కు క్రేజ్ తగ్గలేదు. అందుకే చక్కని ప్రేమలేఖను ముందుగానే రెడీ చేసుకోవాలి. ప్రేయసితో కలిసి లంచ్ లేదా క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడమనేది మరో మెమరబుల్ మూమెంట్. 

ఆ తర్వాత సరదాగా కబుర్లు చెప్పకుంటూ లాంగ్ డ్రైవ్‌కు వెళ్తే ఆ మజాయే వేరు. ఇక చేయాల్సిన మరో విషయం మొట్టమొదట కలుసుకున్న రోజు జరిగిన విషయాలను గుర్తు చేసుకోవడం. ఈ విషయాలు ఎంతో సరదాగా ఉంటాయి.