27 ఫిబ్ర, 2012

'గబ్బర్ సింగ్' లీకైన మరో రెండు డైలాగులు

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ లోంచి మరో డైలాగు లీకైందంటూ ఓ డైలాగు నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆ డైలాగు ఏమిటంటే...

విలన్ : రోడ్డు పట్టిన రౌడీవా...గన్ పట్టిన గూండావా...ఎవడ్రా నువ్వు
పవన్ కళ్యాణ్ :పొగరు పట్టిన పోలీసుని రా...వన్స్ డిసైడ్ అయితే నో డిస్కషన్స్

అలాగే మరో చోట విలన్ వచ్చి మార్క్టెట్ ని తమ మనుష్యులతో ఆక్యుపై చేసి మధ్యలో నిలబడి మార్కెట్ నాది..నన్ను ఆపే మగాడు లేడు అని అరుస్తాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఓ రిక్షాలో అక్కడికి వస్తాడు. వెనక ఆర్.ఆర్. లో ఈ పేటకు నేనే మేస్త్రి అని వస్తూంటుంది. అలా విలన్ కి పంచ్ ఇస్తాడన్నమాట.

అలాగే విలన్ ప్రెండ్ వచ్చి శృతి హాసన్ ని పెళ్లి చేసుకోబోతూంటే..

గబ్బర్ సింగ్ : "నీకు మూడు ముళ్లు కావాలా...ముప్పై బుల్లెట్లు కావాలా.."


ఇక ఈ చిత్రం టీజర్ ఈ మధ్యనే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. జనవరి 29న హైదరాబాద్ లో ప్రారంభమయ్యే షెడ్యూల్ తో ఈ చిత్రం షూటింగ్ మాగ్జిమం కంప్లీట్ అయ్యిపోయినట్లే. ఏప్రియల్ 27న చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరక్ట్ చేస్తున్నాడు. దబాంగ్ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో డైలాగులకు ప్రయారిటీ ఉన్నందువల్లే ఈ చిత్రానికి హరీష్ ని ఎంచుకున్నాడని చెప్తున్నారు. తన మాస్ డైలాగులతో హరీష్ అభిమానులు చేత టప్పట్లు కొట్టిస్తాడని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే టీజర్ లో చెప్పిన నాకు కొంచెం తిక్కుంది..కాకపోతే దానికో లెక్క ఉంది అన్న డైలాగు అందరి చేతా శభాష్ అనిపించుకుంది.