18 ఫిబ్ర, 2012

నాకంటే పొట్టివాడైతే లాభంలేదు.. పొడగరి అయితే ఓకే: అనుష్క

ఈడూజోడూ అనేది కుదరాలి. అప్పుడే ముచ్చటగా ఉంటుంది. నా విషయంలో అలానే ఉండాలని కోరిక ఉందని నటి అనుష్క చెబుతోంది. సినిమాల్లోనూ నా హైట్‌కు తగిన హీరోనే బెటర్‌ అని దర్శక నిర్మాతలే ఆలోచిస్తారు. పంచాక్షరి సినిమా చేసేటప్పుడు నాకు జూనియర్‌ అయిన సామ్రాట్‌ నాకంటే హైట్‌గా ఉండటంతో ఎంపిక చేశారని గుర్తుచేసింది. 

మరి పెండ్లి విషయంలో నా ఎత్తు వల్ల చాలా సమస్యలు వస్తాయని మీడియా వారు తెగ అడిగేస్తున్నారు. నేను పెండ్లి చేసుకుకేంటే.. నాతో సమానంగా పొడుగ్గా ఉండేవాడినే చేసుకుంటాను. అంతేగానీ తగ్గితే మాత్రం చేసుకోనని చెప్పేసింది. 

తాజాగా ఆమె నాగార్జున చిత్రం 'ఢమరుకం'లో నటిస్తోంది. అందులో ప్రత్యేక పాత్రలో నటించేందుకు అనుష్కను ఎంపిక చేశారు. రొటీన్‌ కథాంశం కాకపోయినా.. సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగుతుంది.