19 ఫిబ్ర, 2012

ఏలూరు రామకోటి ఉత్సవాల్లో వింత

బహుళ ఏకాదశి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని పేరయ్యకోనేరులో జరుగుతున్న రామకోటి ఉత్సవాల్లో వింత చోటుచేసుకుంది. బంగాళాదుంపలో గోమాతరూపం దర్శనమిచ్చింది. దీంతో భక్తులు దీనిని దైవమహిమగా భావిస్తూ పూజలు చేస్తున్నారు. ఉత్సవాల్లో శ్రీసత్యనారాయణస్వామి సామూహిక వ్రత మహోత్సవాలు జరుగుతుండగా సమీపంలోని ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లో గోమాతరూపం దర్శనమిచ్చింది. దీనిని పరిశీలించిన పండితులు ఇది దేవుని కృపే అంటున్నారు. దీంతో భక్తులు తరలివచ్చి పూజలు చేస్తున్నారు.