16 ఫిబ్ర, 2012

మహేష్ ఫ్యాన్స్ చూపించిన ప్రేమ...

మహేష్‌ల అభిమానులు నాపై చూపించిన ప్రేమ ఈ సినిమా ఓపెనింగ్స్‌లో కనిపించింది. ఇంత సక్సెస్‌ని నేను ఊహించలేదు అంటున్నారు సుధీర్ బాబు. మహేష్ బావ అయ్యిన సుధీర్ బాబు హీరోగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘ఎస్‌ఎంఎస్’. మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ సమర్పణలో తాతినేని సత్య దర్శకత్వంలో విక్రమ్‌రాజ్ నిర్మించిన ఈ చిత్రం క్రిందటి శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుని మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఆ ఉత్సాహాన్ని పంచుకోవటానికి హైదరాబాద్ లో ఈ చిత్రం సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే... విడుదలకు ముందు ‘ఎస్‌ఎంఎస్’ చిన్న సినిమా. విడుదలయ్యాక పెద్ద సినిమా అయ్యింది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి త్వరలోనే సక్సెస్ టూర్‌కి వెళ్లనున్నాం అని అన్నారు. 

ఇక హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ.. మరచిపోలేని అనుభూతినిచ్చిందీ సినిమా అన్నారు. ఇక దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ..‘‘ఆర్బీ చౌదరిగారికి ఈ కథపై ఎంతో నమ్మకం. అందుకే 245 కేంద్రాల్లో విడుదల చేశారు. వారి నమ్మకాన్ని ఈ సినిమా నిజం చేసింది’’ అని అన్నారు. ‘అలా మొదలైంది’ తర్వాత తనకు ఆ స్థాయి గుర్తింపు తెచ్చిన సినిమా ఇదని తాగుబోతు రమేష్ అన్నారు. ఇంకా కాశీ విశ్వనాథ్, డాన్స్ మాస్టర్ శేఖర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.