17 ఫిబ్ర, 2012

జెనీలియా సినిమాలకు గుడ్‌బై చెబుతుందా ?

ప్రేమికుడు రితేష్‌ని పెళ్లి చేసుకున్న జెనీలియా సినిమాలకు గుడ్‌బై చెప్తుందా? ఎప్పట్లాగే కెమెరా ముందు కవ్విస్తుందా? సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో మెరిసిన జెన్నీ దంపతుల ఫ్యూచర్ ప్లాన్‌ ఏంటి? ఇలాంటి సందేహాలకు త్వరలోనే ఫుల్‌స్టాప్‌ పడనుంది. వెండితెరపై ఇద్దరూ కలిసి నటించనున్నారు. పదేళ్లుగా ప్రేమించుకుని ఈ మధ్యే ఒక్కటైన బాలీవుడ్‌ జంట.. రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా. 

రియల్‌ లైఫ్‌లో ఏడడుగులు నడిచిన ఈ నవ దంపతులు.. రీల్‌లైఫ్‌లోనూ కలిసి సాగాలని డిసైడైనట్టున్నారు. మస్తీ సినిమా సీక్వెల్‌లో వాళ్లిద్దరూ జంటగా నటిస్తారని ముంబై ఖబర్. సిల్వర్‌ స్క్రీన్‌పై రితేష్‌, జెన్నీ మధ్య కెమెస్ట్రీ చక్కగా పండుతుందని భావిస్తున్నారు. అయితే.. మస్తీ టూలో తారాగణంపై ఇంకా దృష్టి పెట్టలేదని సదరు నిర్మాత చెప్తున్నారు. 

కథ, కథనంపైనే ప్రస్తుతానికి దృష్టి పెట్టామంటున్నారు. మేలో సెట్స్‌పైకి వెళ్లబోతున్న ఆ ప్రాజెక్ట్‌లో.. వీళ్లిద్దరితో పాటు వివేక్ ఒబెరాయ్, ఆఫ్తాబ్ శివదాసాని నిటిస్తారని చెప్తున్నారు. అయితే.. పెళ్లయ్యాక విడుదలయ్యే వీరి తొలి సినిమా వేరే ఉంది. అదే..''తేరే నాల్‌ లవ్‌ హోగయా". ఈ నెల 24న రిలీజ్‌ కాబోతోంది. మరి, ప్రేక్షకుల్ని ఏమేరకు మెస్మరైజ్‌ చేస్తారో చూడాలి.