16 ఫిబ్ర, 2012

అఫైర్ వార్తపై శృతిహాసన్‌కు పత్రిక క్షమాపణలు

మొత్తానికి వీక్లీ మ్యాగజైన్ శృతిహాసన్ కి క్షమాపణ చెప్పింది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ శృతి ట్వీట్ చేస్తూ... ఈ రోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు..నా మీద ఫేక్ కథనం రాసిన వీక్లీ మ్యాగజైన్ క్షమాపణ చెప్పింది. అల్టిమేట్ గా నిజం ఏమిటనేది ప్రపంచానికి తెలిసింది అంది. ఇక క్రితం నెలలో ఆమెపై ధనుష్, శ్రుతిల ఎఫైర్ గురించి ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనం హాట్ టాపిక్ అయ్యింది. అందులో ఈ నెల 1న ఐశ్వర్య బర్త్‌డేకి కూడా ధనుష్ టైమ్ కేటాయించలేదని, ఆ సమయంలో శ్రుతితో పార్టీ చేసుకున్నారని కూడా రాసుకొచ్చింది. దినపత్రికలో న్యూస్ వచ్చిందంటే అందులో ఎంతో కొంత నిజం ఉండి ఉంటుందని చెన్నయ్‌ వర్గాలు ఫిక్స్ అయ్యాయి. దాంతో ఎక్కడ విన్నా ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. 

మరో ప్రక్క ఈ చిత్రంలోని రొమాంటిక్ సన్నివేశాల్లో ధనుష్, శ్రుతి మొహమాటం లేకుండా లీనమై నటించడం కూడా సంచలనమైంది. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉంది కాబట్టే ఇంతగా లీనమయ్యారని కూడా మాట్లాడుకుంటున్నారు. శ్రుతిహాసన్‌తో స్నేహం చేయడం మొదలుపెట్టిన తర్వాత ధనుష్ తన భార్యను పట్టించుకోవడంలేదని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. ఇవన్నీ చదివిన రజనీకాంత్ తలపట్టుకుని కూర్చున్నాడుట. దాంతో ఇక శృతి కలగచేసుకుని ఇలా ఖండనలు పేరుతో మీడియాని తిట్టిపోసింది. చివరకు ఆ పత్రికకు నోటీస్ పంపింది. దాంతో ఆ పత్రిక దిగి వచ్చి ఆమెకు సారి చెప్పింది. దాన్ని తన ట్విట్టర్ లో రాసి తన కసి తీర్చుకుంది శృతి.