23 ఫిబ్ర, 2012

వేరే హీరోతో రజనీ 'బాషా' సీక్వెల్

ఈ భాషా ఒక్కసారి చెపితే వంద సార్లు చెప్పినట్లు...అంటూ రజనీకాంత్ చెప్పే డైలాగుని మరిచిపోవటం కష్టమే. రజనీకాంత్ సూపర్ హిట్ భాషా లో ఇలాంటి కేక పుట్టించే డైలాగులు,సీన్స్ చాలా ఉన్నాయి. దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన దర్శకుడు సురేష్ కృష్ణ కి కలిగిందీ. దాంతో ఆయన స్క్రిప్టు రెడీ చేసుకున్నాడు. అయితే తమిళంలో దాన్ని రజనీతో చేయటం లేదు. కన్నడంలో ప్లాన్ చేస్తున్నాడు. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 

అప్పట్లో బాషా చిత్రాన్ని కన్నడంలో అప్పటి సూపర్ స్టార్ లేటు విష్ణు వర్ధన్ చేసారు. ఇప్పుడు రాజమౌళి ఈగలో చేస్తున్న సుదీప్ కి ఆ అవకాశం వరించింది. ఇక ఇక్కడ సూపర్ హిట్ అయ్యితే రజనీకాంత్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఆ మధ్య బాషా చిత్రాన్ని తమిళంలో రీ రిలీజ్ చేస్తే మళ్లీ అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఆ ఆలోచన పుట్టినట్లు దర్శకుడు చెప్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేటట్లు ఉంది.