20 ఫిబ్ర, 2012

శ్రీలంకలో రావణుడి మమ్మీ ఉందా?

ఈజిప్టులో ఫారోలకు మమ్మీలు ఉన్నట్లుగానే రామాయణంలో ప్రతినాయకుడు రావణాసురుడికి శ్రీలంకలో మమ్మీ ఉందా అంటే అవుననే అంటున్నారు. శ్రీలంకలోని ఓ కొండలో రావణాసురుడి మమ్మీ వెలుగు చూసిందని అంటున్నారు. రావణుడి మమ్మీ వెలుగు చూసిందనే వాదనల నేపథ్యంలో ఆయన మళ్లీ పుట్టబోతున్నాడా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. కొండలోని రావణుడి మమ్మీ శ్రీలంకలో బెంబేలెత్తిస్తోంది. అంతర్జాతీయ మీడియాలో స్థానం ఆక్రమించాడు. రామాయణంలో యుద్ధం ముగిశాక రావణుడి మృతదేహాన్ని పూడ్చి పెట్టాలని విభీషణుడిని ఆదేశించారు. అయితే విభీషణుడు ఆ పని చేయలేదు. దీంతో శ్రీలంకలోని నాగవంశీకులు రావణుడిని మళ్లీ బతికించే ప్రయత్నం చేశారట. ఇప్పుడు రావణుడి మమ్మీ ఉందని భావిస్తున్న కొండలోకి మృతదేహాన్ని తీసుకు వెళ్లారు. ఎంత ప్రయత్నించినా బ్రతకక పోవడంతో ఆ శవాన్ని మమ్మిగా మార్చారని అంటున్నారు. శవాన్ని ప్రత్యేక మూలికలతో కప్పి ఉంచారని అంటున్నారు. ఈ మమ్మీపై ఓ రాయి పెడితే మళ్లీ బతుకుతాడని భావించిన వారు ఓ రాయిని ఉంచారని, దానిపై ప్రత్యేకమై లిపి ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.

రావణుడి వద్ద భారీగా వజ్రాలు, బంగారం ఉండేదని, ఆయన మృతి తర్వాత ఆ ఖజానాను స్థానిక కొండజాతి తెగలు మమ్మీ క్రింద ఉంచారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే రావణుడి మమ్మీపై పెట్టిన రాయి పైన ఉన్న అస్పష్టమైన లిపి రావణుడి జీవిత చరిత్ర కావొచ్చునని చరిత్రకారులు చెబుతున్నారు. 17 అడుగుల పొడవైన రావణాసురుడి మృతదేహాన్ని గిరిజన తెగలు(నాగవంశీకులు) మమ్మీకరించింది మళ్లీ ఆయన బతుకుతాడని భావించేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రావణుడు శ్రీలంకను ఏలాడని చెప్పడానికి చరిత్రకారులు పలు ఉదాహరణలు చూపిస్తున్నారు. గుర్లుపోతాలో ఏరోస్పేస్, తిరకోనేశ్వరంలో రావణుడి గుడి, సీత ఉన్న ప్రదేశంలో తప్ప ఎక్కడా లేని సీతా పుష్పం, విమానాశ్రయం, నెమలి ఆకారంలో ఉన్న పుష్పక విమానం ఇవన్నీ రావణుడు లంకను ఏలాడనేందుకు నిదర్శనాలు అని చరిత్రకారులు అంటున్నారు.

అలాగే రావణుడి మృతదేహాన్ని మమ్మీకరించడానికి కారణం ఆయన మళ్లీ బతుకుతాడని వారు విశ్వసించడం వల్లనే అంటున్నారు. రావణుడు మళ్లీ బతికి వస్తాడని స్థానికులు కూడా గట్టిగా విశ్వసిస్తున్నారట. మమ్మీకరించడం వల్ల రావణుడి ఆత్మ అక్కడే ఉన్న పర్వత ప్రాంతాల్లో తిరుగుతుందని అక్కడి వారు నమ్ముతారు. ఆ మమ్మీ ఖచ్చితంగా రావణాసురుడిదే అయి ఉంటుందని కొందరు వాదిస్తుండగా మరికొందరు మాత్రం ఆ మాటలను కొట్టి పారేస్తున్నారు.

1 వ్యాఖ్య:

SNKR చెప్పారు...

రావణుడి మమ్మీ వుంటే, డాడీ కూడా అక్కడనే ఎక్కడో వుంటాడు, వెతకండి.