27 ఫిబ్ర, 2012

మహేష్ బాబు ఆధిపత్యానికి సవాల్!

సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇక్కడ ఎప్పుడొచ్చామన్నది కాదు పాయింట్...ఎన్ని హిట్లు కొట్టామన్నదే ముఖ్యం. ఏ హీరో హిట్ల మీద హిట్లు కొడుతూ ముందుంటాడో అతడిదే పై చేయి. అలా అని ఎప్పుడూ ఒకే హీరో ఆధిపత్యం కొనసాగుతుందని చెప్పలేం. పోకరిరి తర్వాత చాలా ప్లాపులు ఎదుర్కొన్న మహేష్ బాబు దూకుడు, బిజినెస్ మేన్ సంచలన విజయంతో మళ్లీ టాప్ పొజిషన్ కు వచ్చారు.

ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్లో మహేష్ బాబు హవా కొనసాగుతుందనే చెప్పాలి. తాజాగా మహేష్ బాబు ఆధి పత్యానికి సవాల్ విసురుతూ వస్తున్నారు ముగ్గురు హీరోలు. వారిలో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే, మరొకరు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, ఇంకొకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ. 

పవర్ స్టార్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం మరికొన్ని రోజుల్లో విడుదల కాబొతోంది. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ తన ‘దమ్ము’ ఏమిటో చూపించడానికి రెడీ అవుతున్నాడు. మగధీర సినిమాతో వచ్చిన స్టార్ ఇమేజ్ నిలబెట్టు కోవడానికి ట్రై చేస్తున్న రామ్ చరణ్ తేజ్ ఈ సారి బాక్సాఫీసును ‘రచ్చ’ చేస్తానంటున్నాడు. మరి ఈ ముగ్గురు హీరోల్లో మహేష్ బాబు స్పీడుకు సవాల్ విసిరి నిలబడేది ఎవరో మరికొన్ని రోజుల్లో తేల నుంది.