21 ఫిబ్ర, 2012

రామ్ చరణ్ ’రచ్చ’ బడ్జెట్ రచ్చే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా భారీ అంచనాలతో రూపొందుతున్న ‘రచ్చ’ సినిమా ఈ సమ్మర్లో మెగా ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధం అవుతోంది. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం మొత్తం ఖర్చు రూ. 29 కోట్లకు చేరువైనట్లు తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా రామ్ చరణ్ రెమ్యూనరేషన్ ఉందని, యాక్షన్ సన్ని వేశాల చిత్రీకరణకు రూ. 2 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు చర్చించుకుంటున్నారు. 

అయితే మెగా పవర్ స్టార్ రేంజ్ కి ఆ బడ్జెట్ ఎక్కువ మొత్తం ఏమీ కాదని, చెర్రీ మార్కెట్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆరెంజ్ సినిమా తర్వాత చరణ్ చాలా గ్యాప్ తీసుకోవడం, సంపత్ నంది దర్శకత్వం వహిస్తుండటం, ముఖ్యంగా చెర్రీ వివాహానికి ముందు రిలీజ్ అవుతుండటం కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. 
మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి నిర్మాతలు : ఎన్వీ ప్రసాద్‌, పారాస్‌జైన్‌, సమర్పణ: ఆర్‌.బి.చౌదరి, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి.

ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ ‘ఎవడు’ చిత్రంలో నటించబోతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి దిల్ రాజు నిర్మాత. దీంతో పాటు వివి వినాయక్ దర్శకత్వంలో మరో సినిమాలో కూడా నటించనున్నాడు.