20 ఫిబ్ర, 2012

సచిన్ కు క్రిక్ ఇన్ఫో అవార్డు

ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోడాట్‌కామ్‌ ప్రకటించిన టెస్ట్‌ బ్యాటింగ్ పెర్‌ఫామెన్స్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును సచిన్ టెండూల్కర్ కైవసం చేసుకున్నాడు. గత యేడాది కేప్‌టౌన్‌లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టుమ్యాచ్‌లో సచిన్ ప్రదర్శనకు ఈ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్‌లో మాస్టర్‌ సెంచరీతో జట్టును కష్టాలనుంచి గట్టెక్కించాడు. ఈ మ్యాచ్ డ్రాకావడంలో146 పరుగులు చేసిన సచిన్ కీలకపాత్ర పోషించాడు. 

న్యూజీలాండ్ యువ బౌలర్ బ్రేస్‌వెల్‌కు టెస్ట్ బౌలింగ్ పెర్‌ఫామెన్స్ ఆఫ్‌ది ఇయర్ అవార్డు లభించింది. ఐర్లాండ్ డాషింగ్ బ్యాట్స్‌మన్ కెవిన్ ఓబ్రైన్‌కు వన్డే బ్యాటింగ్ పెర్‌ఫామెన్స్ ఆఫ్‌ది ఇయర్, ఆస్ట్రేలియా బౌలర్ మిఛెల్ జాన్సన్‌కు వన్డే బౌలింగ్ పెర్‌ఫామెన్స్ ఆఫ్‌ది ఇయర్ అవార్డులు దక్కాయి. మాజీ క్రికెటర్లు, క్రికెట్ కాలమిస్ట్‌లతో కూడిన 16మంది సభ్యుల కల జ్యూరీ విజేతలను ఎంపిక చేసింది.