25 ఫిబ్ర, 2012

ఆండ్రాయిడ్, ఐఫోన్‌ని వాకీటాకీ మాదిరి ఉపయోగించడం ఎలా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్‌ని వాకీటాకీగా ఎలా మార్చుకోవచ్చో తెలుసా? చాలా సింపుల్. 'హె టెల్' అనే అప్లికేషన్‌ని మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోల్ లేదా ఐపోన్‌లో డౌన్ లోడ్ చేసుకుంటే సరి. దీని సహాయంతో స్నేహితులతో ఏదైనా సమాచారాన్ని అర్జెంటుగా పంచుకోవాలనుకుంటే వాయిస్ మెసేజ్‌లను పంపోచ్చు. అవతలి వైపున ఉన్న మీ స్నేహితుల వద్ద కూడా 'హె టెల్' అనే అప్లికేషన్‌ ఉంటే వారు కూడా మీతో వాకీటాకీలో మాదిరి వాయిస్ మెసేజ్‌లను షేర్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ని ఫోన్‌లో ఇనిస్టాల్ చేసి రన్ చేసిన తర్వాత ఒక బటన్‌ను ఒత్తి పట్టుకోని మీ వాయిస్ మేసేజ్ ఇవ్వడం, మిత్రుడి ఫోన్ నెంబర్‌ను ముందుగానే సెలక్ట్ చేసుకోవం మాత్రామే మనం చేయాల్సిన పని. ఈ ఆప్లికేషన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్‌తో పాటు ఐఫోన్‌లో కూడా పని చేస్తుంది. ఐఫోన్ నుండి ఐఫోన్‌కు మాత్రమే వాయిస్ మెసేజ్‌లను పంపవచ్చు, అందుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నుండి మాత్రం ఐఫోన్‌కూ మేసేజ్‌లను పంపే వెసులుబాటు కల్పించారు.