24 ఫిబ్ర, 2012

ఏజ్ పెరిగినా క్రేజ్ తగ్గని సల్మాన్

ఏజ్‌ పెరిగినా.. తనలో ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదని నిరూపించుకున్నాడు బాలీవుడ్ బ్యాడ్‌ బాయ్ సల్మాన్ ఖాన్. వరుస విజయాలతో ఒక వైపు దూసుకుపోతూనే మరోవైపు యాడ్ ఫిల్మ్‌లో కూడా తన సత్తా చాటుతున్నాడు. లేటెస్ట్‌గా ఒక యాడ్‌లో నటించేందుకు గంటకు కోటిరూపాయల రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నాడు సల్లూభాయ్. మొత్తం ఎనిమిది గంటల షూటింగ్‌కు, ఎనిమిది కోట్లు తీసుకొని బాలీవుడ్‌లో తన స్టామినా ఏంటో సల్మాన్ మరోసారి నిరూపించాడు. 

వయస్సు 46 సంవత్సరాలు అయితేనేం.. తనలో ఇంకా ఏమాత్రం వన్నె తగ్గలేదని సల్మాన్ నిరూపించుకున్నాడు. యాడ్‌ ఫిల్మ్‌ రెమ్యూనరేషన్‌లో బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్ షారూఖ్‌ను సైతం సల్లూ వెనక్కి నెట్టేశాడు. కేవలం ఎనిమిది గంటల యాడ్ షూటింగ్‌ కోసం అక్షరాలా ఎనిమిది కోట్లు తీసుకొని సంచలనం సృష్టించాడు. అయితే మొదట సల్మాన్ చేయాల్సిన ఈ యాడ్ నిజంగా క్రికెటర్ యువరాజ్‌ చేయాల్సింది. 

కానీ క్యాన్సర్ ట్రీట్‌ మెంట్‌ తీసుకుంటూ యువరాజ్ అందుబాటులోకి లేకపోవడంతో ఈ గోల్డెన్‌ ఛాన్స్ సల్మాన్‌ను వరించింది. గంటకు కోటి రూపాయలు ఇవ్వాలని సల్మాన్ డిమాండ్ చేసినా, యాడ్ నిర్మాతలు మాత్రం అడిగినంత ఇవ్వడానికే మొగ్గు చూపారు. మొత్తం మీద భారీ రెమ్యూనరేషన్‌ తీసుకొని మరోసారి తన సత్తా ఏంటో సల్మాన్ చాటిచెప్పాడు.