21 ఫిబ్ర, 2012

నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు : శ్రద్దా దాస్

హీరోయిన్ శ్రద్దా దాస్ మరో సారి తన వ్యక్తిగత విషయాలపై వచ్చిన రూమర్స్ తో వార్తల్లోకి ఎక్కింది. గత సంవత్సరం వరుణ్ సందేష్ తో సిక్రెట్ గా ‘సం’బంధం కొనసాగిస్తుందనే గాసిప్స్ ఈ భామపై వినిపించాయి. ఆ వార్తలు నిజమేనేమో అన్న చందంగా ఇద్దరూ రాసుకు పూసుకుంటూ చట్టాపట్టాలేసుకుని తిరగడం కూడా కనిపించింది. అయితే ఏమైందో తెలియదు కానీ గత కొన్ని రోజులుగా ఇద్దరూ దూరం అయినట్లే కనిపిస్తోంది. 

తాజాగా శ్రద్ధా దాస్‌పై మరో రూమర్ వినిపిస్తోంది. ఆమెకు ఇప్పటికే ఎంగేజ్ మెంట్ పూర్తయిందని, త్వరలో పెళ్లి చేసుకోబోతోందని ఆ వార్తల సారాంశం. అయితే ఈ వార్తలను శ్రద్దా దాస్ ట్విట్టర్ ద్వారా ఖండించింది. తాను పెళ్లి చేసుకోవడం లేదని, మరో పదేళ్ల వరకు ఆ ఆలోచన లేదని, కెరీర్ పైనే తన దృష్టని, కెరీర్ తోనే తన పెళ్లయిపోయిందని, నేను జీవితంలో సాధించాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం శ్రద్ధా దాస్ వైవిఎస్ చౌదరి రూపొందిస్తున్న ‘రేయ్’ సినిమాలో తప్ప మరెందులోనూ నటించడం లేదు. అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తోంది.