22 ఫిబ్ర, 2012

స్వల్ప గాయాలతో హన్సిక బయిటపడింది

హన్సిక కి తెలుగులో ఇమేజ్ రోజు రోజుకీ తగ్గిపోయినా తమిళంలో మాత్రం రివర్స్ గేర్ లో పెరిగిపోతూ వస్తోంది. ఆమె లావు అవటమే అక్కడి వారికి బాగా నచ్చుతున్నట్లుంది. ఒకప్పటి హీరోయిన్లు ఖుష్బూ, నగ్మాల తర్వాత హన్సికకి మాత్రమే ఇంతటి ఫాలోయింగ్‌ కనిపించిందంటుని అక్కడి పరిస్ధితి చూసిన తమిళ మీడియా అంటోంది. ఇక ఈ విషయం నిర్దారణకు అన్నట్లు రీసెంట్ గా...ఈ ముద్దుగుమ్మ కోయంబత్తూరుకు ఒక కార్యక్రమం కోసం వెళ్ళింది. అప్పుడు నిర్వాహకులు ఏ మాత్రం ఊహించని రీతిలో అభిమానులు చుట్టు ముట్టేశారు. 

చివరికి అదనపు బలగాల్ని రప్పించినా హన్సికను కారు వద్దకు తీసుకెళ్ళడానికి నానా పాట్లు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈ సింధీ భామకు స్వల్పంగా గాయాలయ్యాయి. అయితేనేం ఆ క్రౌడ్ లోంచి ఆమె బయిటపడటానికి నానా యాతన పడాల్సి వచ్చింది. గత ఏడాది తెలుగులో'కందిరీగ', 'ఓ మై ఫ్రెండ్‌' రూపంలో తనకు మంచి హిట్స్‌ వచ్చాయంటోంది. ప్రస్తుతం తమిళంలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లతో బిజిగా ఉన్న ఒకప్పటి ఈ బాలతారకు అక్కడ విజయ్‌ సరసన నటించిన 'వేలాయుధం' చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.