28 ఫిబ్ర, 2012

మహేష్, ఎన్టీఆర్ మధ్య టైటిల్ వివాదం!?

మహేష్ బాబు, ఎన్టీఆర్ ల మధ్య టైటిల్ వివాదం వచ్చిందని వినిపిస్తోంది. అయితే అది హీరోల మధ్యన కాదు. వివరాల్లోకి వెలితే శ్రీను వైట్ల, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి బాద్షా అనే టైటిల్ ని నిర్ణయించారు. అయితే ఇప్పటికే ఆ టైటిల్ ని మహేష్ బాబు కోసం బూరుగుపల్లి శివరామ కృష్ణ రిజిస్టర్ చేయించారు. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఆ చిత్రానికి కూడా శ్రీను వైట్లే డైరక్టర్. దాంతో అక్కడ అనుకున్న టైటిల్ ని ఇక్కడ శ్రీను వైట్ల చెప్పటం జరిగింది. అయితే రెండు చోట్లా శ్రీను వైట్లే డైరక్టర్ కావటంతో ఈ వివాదం పెద్దగా మారదని త్వరలోనే సమిసిపోతుందని అంతా భావిస్తున్నారు. 

ఇక ప్రస్తుతం దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ కథ-స్క్రిప్టు ఫైనల్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఇప్పటి వరకు టైటిల్ ఏమిటి అనేది ఖరారు చేయలేదు. ఈ సినిమా టైటిల్ విషయమై గోపీ మోహన్ తన మైక్రో బ్లాగింగ్లో స్సందిస్తూ...ఇప్పటి వరకు సినిమా టైటిల్ ఫైనల్ చేయలేదని ‘యాక్షన్’ టైటిల్ తో పాటు ‘బాద్‌షా’ అనే మరో టైటిల్ కూడా పరిశీలనలో ఉందని, త్వరలోనే అధికారకంగా అనౌన్స్ చేస్తామని అన్నారు.