13 ఫిబ్ర, 2012

ఇలియానా పై బ్యాన్ తప్పేటట్లు లేదు

ఇలియానాపై బ్యాన్ తప్పదనే అంటున్నారు కోలీవుడ్ వాసులు. ఆమె రీసెంట్ గా నటరాజన్ అనే తమిళ నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్ విషయంలో గొడవ పడి ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ గోవా సుందరి చాలా గ్యాప్ తరువాత ఒప్పుకున్న ‘నన్‌బన్’ సినిమాకు ముందే విక్రమ్ సరసన ఓ చిత్రంలో నటించడానికి ఇలియానా ఓకే చేసింది. భూపతిపాండ్యన్ దర్శకత్వంలో మోహన్ నటరాజన్ నిర్మించతలపెట్టిన ఆ చిత్రం అనివార్య కారణాల వల్ల తెరకెక్కలేదు. అయితే ఆ సినిమాకు ఇలియానా 40 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుంది. తీసుకున్న మొత్తం తిరిగి ఇవ్వవలసిందిగా మోహన్ నటరాజన్ అడగ్గా... ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది ఇలియానా. దాంతో ఆయన నిర్మాతల మండలిని ఆశ్రయించారు. 

ప్రస్తుతం ఈ వివాదంపై నిర్మాతల మండలి చర్చిస్తోంది. అడ్వాన్స్ తిరిగి చెల్లించకపోవడంతో ఇలియానాపై నిషేధం వేటుపడే అవకాశం ఉందనే అభిప్రాయం కోలీవుడ్‌లో వ్యక్తమవుతోంది. మొన్న శనివారం కూడా ఇదే విషయమై తమిళ చిత్ర నిర్మాతల మండలి చర్చిందని, అయితే ఇలియానా వైపు నుంచి సమాధానం పాజిటివ్ గా రాలేదని తెలుస్తోంది. ఇలియానా చాలా రెక్లెస్ గా వ్యవరిస్తోందని తమిళ సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అందులోనూ గతంలో ఇలియానా డేట్స్ కోసం తిరిగి దొరక్క ఇబ్బంది పడిన వారు సైతం ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా పట్టుదలతో బ్యాన్ పెట్టాలని తిరుగుతన్నారు. ప్రస్తుతం ఇలియానా తెలుగులో అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తోంది.