28 ఫిబ్ర, 2012

'సీతమ్మవాకిట్లో...' నుంచి ప్రకాష్ రాజ్ అవుట్

మహేష్, వెంకటేష్ కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజు ఓ కీలకమైన రోల్ లో కనిపించనున్నాడనే సంగతి తెలిసిందే. వెంకటేష్,మహేష్ తండ్రిగా ఆయన కనిపించనున్నారని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ సినిమా నుంచి బయిటకు వెళ్లిపోయాడని తెలుస్తోంది. దిల్ రాజు తో వచ్చిన విభేధాలే దీనికి కారణమని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. తాను డైరక్ట్ చేసిన ధోని చిత్రాన్ని దిల్ రాజు తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తాడని ఆశించిన ప్రకాష్ రాజ్ కి నిరాశ కలగటమే దానికి కారణమని చెప్తున్నారు. 

ధోని చిత్రం ఆర్దికంగా బాగా దెబ్బతీసిందని, పెద్ద ప్లాప్ అయ్యి ప్రకాష్ రాజ్ కు చాలా ఇబ్బందికలిగించిందని చెప్తున్నారు. దీనికి కారణం తాను ఎంతో నమ్మిన దిల్ రాజు ప్రమోట్ చేయకపోవటమేనని భావిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక ప్రకాష్ రాజ్ పాత్రకు గానూ తమిళ నటుడు సత్యరాజ్ ని ఎంపిక చేసే అవకాశముందని చెప్తున్నారు. సత్యరాజ్ ని రీసెంట్ గా పిలిచి ఫోటో షూట్ కూడా చేసాడని చెప్పుకుంటున్నారు. 

ఇక ఈ చిత్రం గురించి దిల్‌ రాజు మాట్లాడుతూ ‘‘25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీస్టారర్‌ ఇది. వెంకీ, మహేష్‌ అన్నదమ్ము లుగా నటిస్తున్నారు. సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు..అంటే కుటుంబం. టైటిల్‌ మంచి ఫీల్‌నిచ్చింది. మే నెలాఖరుకి సినిమా పూర్తిచేసి..అదే నెలలో విడుదల చేస్తాం అన్నారు. దసరా రోజు పూజ చేసి లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ లో వెంకటేష్, ప్రకాష్ రాజ్ ఇద్దరూ షూటింగ్ లో పాల్గొంటారు. సహనిర్మాతలు: శిరీష్‌- లక్ష్మణ్‌, కథ- కథనం-మాటలు-దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.