28 ఫిబ్ర, 2012

ఆ భారీ సినిమాలో నయనతార గెస్ట్ రోల్

నయనతార తిరిగి నటించటానికి రెడి అయిందని తెలియగానే ఎక్కడెక్కడి ప్రొడక్షన్ కంపెనీలు ఆమెను సంప్రదిస్తున్నాయి. తాజాగా ఆమె 'బిల్లా-2'లో కనిపించటానికి అంగీకరించిందని సమాచారం. బిల్లా లో ఆమె బికినీలో కనపించి సినిమాని ఓ రేంజికి తీసుకువెళ్లింది. ఆ హిట్ ని మళ్లీ గుర్తు చేయటానికా అన్నట్లు ఆమెను ఈ చిత్రంలో చిన్న పాత్రలో అయినా కనిపించమని రిక్వెస్ట్ చేసి ఒప్పించారని చెప్తున్నారు. ఇక బిల్లాకు ప్రీక్వెల్ గా రెడీ అయిన ఈ చిత్రాన్ని మాత్రం రీమేక్ రైట్స్ ఇవ్వకుండా డబ్బింగ్ చేస్తున్నారు. వారు తమ ఒరిజనల్ వర్క్ ని తెలుగు ప్రేక్షకులకు చూపించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఓ పెద్ద నిర్మాత బిల్లా 2 రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. 

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తారా? లేక పునర్నర్మిస్తారా? అన్న విషయం పై ఇన్నాళ్లూ సప్సెన్స్ ఉంది. అయితే ఇప్పుడు అది విడిపోయింది. అంతా ప్రభాస్‌ తో రీమేక్ చేస్తారని ఆసించారు. అయితే ఆ అంచనాలను కాదని వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ మధ్య కమల హాసన్‌, వెంకటేష్‌ లు నటించిన 'ఈనాడు' చిత్రానికి దర్శకత్వం వహించిన చక్రి తోలేటి ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

అజిత్‌ సరసన పార్వతి ఓమనకుట్టన్‌, బ్రునా అబ్దుల్లా నాయికలుగా నటిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. వేసవి సందర్భంగా మేలో సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు. నయనతార ఈ చిత్రంలో నిజంగా కనపడితే మాత్రం సినిమాకు జరిగే బిజినెస్ రేంజే వేరు అని అంచనాలు ట్రేడ్ సర్కిల్స్ లో మొదలయ్యాయి.