23 ఫిబ్ర, 2012

చెన్నైలోని వేలాచేరిలో భారీ ఎన్కౌంటర్

చెన్నైలోని వేలాచేరిలో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఒక ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఉంటున్న ఐదుగురు దొంగలను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసులకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. దొంగలు బీహార్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు చెందినవారని పోలీసులు తెలిపారు. వీరి నుంచి పోలీసులు 30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

గతంలో వీరు పెరుంగుడి, కీల్‌కోట్టై బ్యాంకులలో దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు ఈ క్వార్టర్స్‌ను మూడు నెలల క్రితం అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి కాల్పులు జరిగినా చుట్టుపక్కల వాళ్లు మాత్రం తమకెటువంటి శబ్దాలు వినబడలేదని చెప్పడంతో, ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాయపడిన పోలీసుల పేర్లు రవి, జయశీల్‌ అని పోలీసు వర్గాలు తెలిపాయి. క్వార్టర్స్‌ నుంచి ఐదు పిస్టల్స్‌, రెండు రివాల్వర్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.