21 ఫిబ్ర, 2012

సునీల్ కీ, పూల రంగడు డైరక్టర్ కీ తీవ్ర విభేదాలు?

ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన అంశం..సునీల్ కీ,పూల రంగడు దర్శకుడు కీ మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్న విషయం. మొన్న శనివారం విడుదలైన పూల రంగడు చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే సునీల్ కే ఆ క్రెడిట్ మొత్తం పోయింది. అతని డాన్స్ లు,సిక్స్ ప్యాక్ ని సినిమా లేపి నిలబెట్టాయని,కామెడీ మొత్తం మళయాళ ఒరిజనల్ దర్శకుడుకే దక్కకుతుందని రివ్యూలు వచ్చాయి. ఈ నేపధ్యంలో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాంగంగా దర్శకుడుతో పాటు సునీల్ వెళ్లకుండా కేవలం తనొక్కడే లైవ్ లకు వెళ్లివస్తున్నాడు. 

రీసెంట్ గా టీవీ నైన్ లైవ్ కి తన సిక్స్ ప్యాక్ కోచ్ ని తీసుకుని సునీల్ వెళ్లటం..వీరభద్రాన్ని షాక్ కు గురిచేసిందని సమాచారం. దాంతో సునీల్ కి తనకు మధ్య విభేదాలు వచ్చాయని,తనకు చెప్పకుండానే సునీల్ ఒక్కడే ఛానెల్స్ కు వెళ్లతున్నాడని టీవీ ఛానెల్స్ కు స్వయంగా తానే ఫోన్ లు చేసి చెప్తున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా మీడియా వాళ్లు కనపడిన వెంటనే నేను లైవ్ కి వస్తాను,ఎరేంజ్ చేయండి అని అడుగుతున్నాడట. దాంతో మీడియా వాళ్ళు వీరభద్రం ఫోన్ అన్నా,కనపడినా హడిలిపోతున్నారని వినిపిస్తోంది. మరో ప్రక్క పూల రంగడు షూటింగ్ జరిగినన్ని రోజులూ దర్శకుడుకి ఏమీ తెలియదని,తనే అంతా కష్టపడాల్సి వస్తుందని సునీల్ అన్నట్లుగా వినపడ్డాయి. ఇప్పుడు ఈ విభేదాలు తో అది తారాస్ధాయికి వెళ్లిందంటున్నారు.