14 ఫిబ్ర, 2012

"మెగా" సమైక్యాంధ్ర... "మెగా పవర్" తెలంగాణ

తెలంగాణ ఉద్యమ సమయంలో తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెప్పిన చిరంజీవి తెలంగాణలోని అభిమానులకు కాస్తంత దూరమయ్యాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయి, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు శిరోధార్యమేనంటూ సమస్యను కాంగ్రెస్ హైకమాండ్ నెత్తిన వేశారు. 

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఆయన తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ తన తదుపరి చిత్రం రచ్చలో తెలంగాణ ప్రాంత కుర్రాడిగా కనిపించబోతున్నాడట. అంతేకాదు.. తెలంగాణ ప్రాంత భాషను కూడా మాట్లాడబోతున్నట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. 

అలాగైనా తెలంగాణాలో తండ్రి కోల్పోయిన అభిమానాన్ని తిరిగి తెస్తాడేమో చూద్దాం.