26 ఫిబ్ర, 2012

'గబ్బర్‌ సింగ్'లో టాప్ బాలీవుడ్ హీరోయిన్

నేను ఎస్యూరెన్స్ ఇస్తున్నాను...గ్యారెంటీగా టాప్ బాలీవుడ్ హీరోయిన్ మా గబ్బర్ సింగ్ లో ఐటం సాంగ్ చేస్తుంది అంటున్నారు నిర్మాత బండ్ల గణేష్. ఆయన తన తాజా చిత్రం గబ్బర్ సింగ్ టీజర్ రెస్పాన్స్ గురించి మీడియాకు చెప్తూ ఈ రకంగా స్పందించారు. అలాగే ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. డైరక్టర్ హరీష్ శంకర్ రాసిన పవర్ ప్యాకెడ్ వన్ లైనర్స్ గ్యారెంటీగా రాకింగ్ గా అందర్ని అలరిస్తాయి. పవన్ ఫెరఫార్మెన్స్ అభిమానులకు ట్రీట్ లా ఉంటుంది అన్నారు. ఐటం సాంగ్ కి చేసే వాళ్ళను ఇప్పటివరకూ ఫైనలైజ్ చేయలేదని,కానీ టాప్ స్టార్ తో చేయిస్తామని భరోసా ఇచ్చారు. ఇక టీజర్ విడుదలైన క్షణం నుంచే పవన్‌కల్యాణ్ అభిమానుల నుంచీ, జనం నుంచీ అనూహ్యమైన స్పందన వచ్చిందని గణేశ్ చెప్పారు. ఈ టీజర్‌లో పవన్‌కల్యాణ్ చెప్పిన 'నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది' అనే డైలాగ్ అదిరిపోయిందంటున్నారు. ఈ సినిమాలో హరీశ్ శంకర్ ఇలాంటి సూపర్ డైలాగ్స్ ఎన్నో రాశారు. 

ప్రారంభం నుంచి చివరి దాకా పవన్‌కల్యాణ్ చెప్పే ప్రతి డైలాగ్‌కీ జనం చప్పట్లు కొడతారు. ఆయన కెరీర్‌లో నెంబర్‌వన్‌గా నిలవడమే కాక, కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తుంది 'గబ్బర్‌సింగ్'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ఎస్సెట్. మార్చి నెలాఖరుకు షూటింగ్ పూర్తిచేసి, ఏప్రిల్ ఆఖరున లేదా మే తొలివారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం'' అని ఆయన తెలిపారు. దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ "కచ్చితంగా అన్ని అంచనాల్నీ 'గబ్బర్‌సింగ్' అందుకుంటాడు. హిందీ సినిమాని పవన్‌కల్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కీ, మేనరిజానికీ తగ్గట్లుగా మార్పులు చేసి, పూర్తి స్థాయి మాస్ క్యారెక్టరైజేషన్‌తో సినిమాని తీర్చిదిద్దుతున్నాం. ఫైట్లు వైవిధ్యంగా ఉంటాయి'' అన్నారు. శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్ నటించగా ఘన విజయం సాధించిన 'దబాంగ్'కు ఇది రీమేక్.