24 ఫిబ్ర, 2012

ఎమ్మార్‌ కేసులో జైలుకెళ్లే వారు!

జైలుకెళ్లేవారు అన్న సిఎం మాటలపై.. ప్రతిపక్షనేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్యంచేశారు. బ్లాక్‌మెయిల్‌ చేసేలా సీఎం మాట్లాడుతున్నారని తీవ్ర స్వరంతో అన్నారు. తన హయాంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని.. కోర్టులు తీర్పిచ్చాయని గుర్తుచేశారు. ఎమార్‌ అంశంపై సిబిఐ తరపున సొలిసిటర్‌ జనరల్‌ వాదించారని సభ దృష్టి తెచ్చారు. ఐఎంజీ భూముల లీజు వ్యవహరంలో.. హైకోర్టు క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని తెలిపారు. 

తనపై 35 కేసులను, 45 విచారణ కమిటీలు వేయడమే కాకుండా సుప్రీం కోర్టు వరకు వెళ్లి కాంగ్రెస్‌ వాళ్లు అభాసుపాలయ్యాయని విమర్శించారు. చివరకు తన కుమారుడి చదువుపై అపనిందలు వేశారని ఆరోపించారు. 9 ఏళ్లు సిఎంగా చిన్న తప్పు చేయలేదన్న చంద్రబాబు... సిఎం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.