22 ఫిబ్ర, 2012

బొత్సకు ఉద్వాసన - తెలంగాణ నేతకు పీసీసీ : దామోదర్ రెడ్డి

ఒకే వ్యక్తికి ఒక పదవి అనే నియమావళి మేరకు జోడు పదువులను అనుభవిస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు త్వరలోనే ఉద్వాసన పలుకవచ్చని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి జోస్యం చెప్పారు. జోడు పదవులు అంశాన్ని ప్రధానంగా చేసుకుని పార్టీ అధినాయకత్వాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. 

పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం దామోడర్ రెడ్డి మాట్లాడుతూ బొత్స సత్యనారాయణను మంత్రి పదవిలో కొనసాగిస్తూ త్వరలోనే పీసీసీ చీఫ్ పదవికి ఉద్వాసన పలుకుతారన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు. 

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త ఆధ్యక్షుడిని నియమించే విషయాన్ని ఏప్రిల్‌లో పరిశీలిస్తామని హైకమాండ్ స్పష్టం చేసిందన్నారు. ఒక వ్యక్తికి ఒక పదవిలో కొనసాగాలన్న నియమాన్ని బొత్స సత్యనారాయణకు వర్తింపజేయాలని తాను కోరగా దానికి కాంగ్రెస్ అధినాయకత్వంలో సానుకూలంగా స్పందించిందన్నారు. అందువల్ల బొత్సను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించి, ఆయన స్థానంలో కొత్తగా మరో నేతను తెలంగాణ ప్రాంతం నుంచి ఎంపిక చేస్తారని దామోదర్ రెడ్డి తెలిపారు.