23 ఫిబ్ర, 2012

5వేలకే కంప్యూటర్.. సంవత్సరం వారంటీ కూడా..!!


సాధారణ ప్రజానికం కోసం జింక్ (Zync) టెక్నాలజీస్ తక్కువ ధరతో కూడిన ఉత్తమ క్వాలిటీ కంప్యూటింగ్ డివైజ్ ను రూపొందించింది. జింక్ ప్యాడ్ Z909 మోడల్ లో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ పీసీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పని చేస్తుంది. మన్నికైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో డిజైన్ కాబడిన ఈ డివైజ్‌ను సంవత్సరం వారంటీతో రూ.5,200 ధరకు విక్రయించేందకు సంస్ధ సిద్ధంగా ఉంది.
‘జింక్ ప్యాడ్ Z909’ ప్రధాన ఫీచర్లు:
* 7 అంగుళాల రెసిస్టిబ్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 800 x 400 పిక్సల్స్),
* వీజీఏ ఫ్రంట్ కెమెరా (ఆటోఫోకస్),
* ఆండ్రాయిడ్ 2.2 ఆపరేటింగ్ సిస్టం,
* 800 MHz సామర్ద్యం గల VIA ప్రాసెసర్,
* 256ఎంబీ సామర్ధ్యం గల డిడీఆర్2 ర్యామ్,
* ఇంటర్నల్ మెమెరీ 4జీబి,
* కార్డ్ మెమరీని 16జీబి వరకు విస్తరించుకోవచ్చు,
* యూఎస్బీ సపోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్.