23 ఫిబ్ర, 2012

ఇరాక్‌లోని వివిధ ప్రాంతాల్లో దాడులు : 50 మంది మృతి

ఇరాక్‌లోని వివిధ ప్రాంతాల్లో గురువారం జరిగిన దాడుల్లో సుమారు 50 మంది వరకు మృత్యువాత పడినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌తో పాటు.. పలు ప్రాంతాల్లో షియా తెగ ముస్లింలను లక్ష్యంగా చేసుకుని గురువారం ఉదయం దాడులు జరిగాయి. 

ఈ దాడుల్లో ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. అలాగే, ఇరాక్‌లోని మరో పది ప్రాంతాల్లోని భద్రతా పెట్రోలింగ్, ప్రభుత్వ కార్యాలయాలు, రెస్టారెంట్లు, పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు దాడులకు పాల్పడటంతో మరికొంతమంది చనిపోయారు. ఈ దాడుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు.