20 ఫిబ్ర, 2012

కార్చిచ్చు కారణంగా యేడాదికి 3.39 లక్ష మంది మృతి!

ప్రతి యేడాది ప్రపంచ వ్యాప్తంగా అడవుల్లో చెలరేగుతున్న అగ్నిప్రమాదాల కారణంగా 3.39 లక్షల మంది మృత్యువాత పడుతున్నట్టు ఒక సర్వేలో వెల్లడైంది. ఇటీవల కెనడాలో జరిగిన ఒక సైన్స్ సదస్సులో జాన్‌స్టన్ అనే అటవీశాస్త్ర నిపుణుడు అడవుల్లో జరుగుతున్న అగ్నిప్రమాదాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. 

అడవులు, పర్వత ప్రాంతాల్లో ఊహించని విధంగా మంటలు చెలరేగడంతో భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో చిక్కుకుని ప్రతి యేడాది మరణిస్తున్న వారి సంఖ్య 3.39 లక్షలుగా ఉందని చెప్పారు. ఇందులో గరిష్టంగా 1.10 లక్షల మంది దక్షిణాసియాలోనే చనిపోతున్నారన్నారు. 

అంతేకాకుండా, పర్యావరణం వేడెక్కడం (గ్లోబల్ వార్మింగ్) వల్ల కూడా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఇలాంటి ప్రమాదాల వల్ల ప్రాణ నష్టంతో పాటు.. పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.