24 ఫిబ్ర, 2012

రోజూ 3 కేజీల చికెన్, 40 గుడ్లు తింటున్న రాణా?

దగ్గుబాటి రాణా త్వరలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు. ఇందు కోసం ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాడు. 2010 మిస్టర్ ఇండియా పోటీల్లో మెడల్ సాధించిన లక్ష్మణ్ రెడ్డి ట్రైనింగులో రాణా సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేస్తున్నారు. ‘నా ఇష్టం’ సినిమా తర్వాత రాణా క్రిష్ దర్శకత్వంలో ‘కృష్ణ వందే జగద్దురుమ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రాణా షర్టు లేకుండా కండలు తిరిగిన బాడీతో కనిపించనున్నాడు.

లక్ష్మణ్ రెడ్డి ఆ రేంజ్ లో కండలు తిరిగిన బాడీ పెంచడానికి రోజూ 3 కిలోల చికెన్, 40 గుడ్లతో పాటు, రెండు మూడే లీటర్ల పాలు తీసుకునే వాడట. ఈ నేపథ్యంలో రాణాకు కూడా అదే విధంగా ట్రైనింగ్ ఇస్తున్నాడని, తన తీసుకున్న డైట్‌నే రాణాతో తినిపిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. రాణా ఏది తింటే మనకెందుకు కానీ....అతని సిక్స్ ప్యాక్ బాడీ మాత్రం అదరిపోతుంది అంటున్నారు అభిమానులు. 

రాణా, జెనీలియా కాంబినేషన్ లో రూపొందిన నా ఇష్టం చిత్రం మార్చి 23 విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బ్రహ్మానందం, హర్షవర్థన్, నాజర్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, ఆలీ, భరత్, ఉత్తేజ్, చిత్రం శ్రీను, గిరి, విజయ్‌సాయి, విష్ణు, ప్రగతి, ప్రియ, భవాని, శ్రావణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు.