28 ఫిబ్ర, 2012

హైదరాబాద్ మార్కెట్లోకి 'కేటీఎమ్ డ్యూక్ 200' బైక్

* స్పోర్ట్స్ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ రూ. 1,20,057 

హైదరాబాద్ మార్కెట్లోకి మరో కొత్త స్పోర్ట్స్ బైక్ దూసుకొచ్చింది. యూరప్ మార్కెట్లో రెండో స్థానంలో ఉన్న కేటీఎమ్ మన రాజధానిలో కూడా సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. 'కేటీఎమ్ డ్యూక్ 200' పేరుతో హల్ చల్ చేస్తోన్న ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర లక్షా ఇరవై వేలరూపాయలుగా ఉంది. ఈ స్పోర్ట్స్ బైక్‌ బజాజ్ ఆటో ద్వారా నగరానికి వచ్చిందని ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్ చేసుకొన్న 15 మందికి బైక్స్ అందజేసామని బజాజ్‌ ఆటో ప్రతినిధులు తెలిపారు.