1 సెప్టెం, 2017

చర్మ వ్యాధులకు దివ్యౌషధం పైనాపిల్ రసం

                                          

పైనాపిల్‌లో విటమిన్ సితో పాటు శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలుంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. రక్తపోటును అదుపులో వుంచుతుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. ఎముకలకు బలాన్ని చేకూర్చే మెగ్నీషియం ఇందులో మెండుగా ఉంటుంది. ఇది ఎముక దృఢత్వానికి సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. గాయాలను త్వరగా మానేలా చేస్తుంది. 
 
యాంటీ ఆక్సిడెంట్‌ పోషకాలు నోటి క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి. పైనాపిల్‌లోని యాంటీ-ఆక్సిడెంట్లు నోటి క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల కంటి చూపు మెరగవుతుంది. మూత్రపిండాలకు చెందిన వ్యాధులతో బాధపడే వారికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది. తెగిన గాయాలపై దీని రసం వేస్తే రక్తస్రావం తగ్గుతుంది. పొగతాగడం వల్ల శరీరానికి కలిగే అనర్థాలను ఇది తొలగిస్తుంది. 
 
తాజా పైనాపిల్ రసాన్ని గొంతులో పోసుకుని పుక్కిలిస్తే గొంతు నొప్పి, టాన్సిల్స్ నివారణ అవుతాయి. చర్మ వ్యాధులకు పైనాపిల్ రసం అద్భుతంగా పనిచేస్తుంది. కాలేయ ప్రక్రియను మెరుగు పరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కాశీకి ప్రతిరూపమైన ప్రతికాశి....

    హిందువుగా పుట్టిన ప్రతివాడూ జీవితంలో ఓ సారైనా కాశిని సందర్శించాలని అనుకుంటూ ఉండటం కద్దు. ఒకవేళ ఎవరైనా కాశిని చూడటం సాధ్యం కాకపోతే చనిపోయాక అతడి అస్థికలను గంగలో కలిపితే చాలని జనం భావిస్తుంటారు. అయితే కాశీనగరానికి ఏ మాత్రం తీసిపోని మరో ఆలయం కూడా మన దేశంలో ఉంది మరి. దాని పేరు ప్రతికాశి. తీర్థయాత్రలో భాగంగా ఈ వారం మిమ్మల్ని ఈ ప్రతికాశి ఆలయానికి తీసుకుపోతున్నాం. ప్రతికాశిని ఒకసారి సందర్శిస్తే చాలు వందసార్లు కాశీని సందర్శించినంత పుణ్యం సిద్ధిస్తుందని ఇక్కడ ప్రతీతి.

గుజరాత్, మధ్యప్రదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నందుర్బార్ జిల్లాలో ప్రతికాశి ఆలయం ఉంది. తపతి, పులుంద, గోమై నదుల సంగమస్థలంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ఈ సంగమ స్థలంలో 108 ఆలయాలు ఉండటం కారణంగా దీనికి ప్రతికాశి అని పేరు వచ్చింది. 

ప్రపంచం నలుమూలలనుంచి వేలాది మంది భక్తులు ప్రతికాశీని నిత్యం సందర్శిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం చూస్తే ఒకప్పుడు పగలు ఆరునెలలు, రాత్రి


ఆరునెలలుగా కాలం నడిచేదట. ఆ కాలంలో శివుడు ఓ భక్తునికి కలలో కనిపించి, ఒకే రాత్రి 108 దేవాలయాలు నిర్మించే ప్రాంతంలో తాను నెలకొని ఉంటానని చెప్పాడట. అందుకనే ఇన్ని ఆలయాలను ఒకే చోట నిర్మించడానికి తపతి, పులుంద, గోమై నదుల సంగమస్థలాన్ని పూర్వీకులు ఎంపిక చేశారట. 

తర్వాత శివ భక్తులు ఒకే రాత్రిలో 107 ఆలయాలను కట్టారట. మరునాడు ఉదయానికి 108వ ఆలయం నిర్మించబడింది. అందుకే సూర్య కాంతి కిరణాలు నేరుగా పడిన ఈ 108వ ఆలయానికి ప్రకాశ అని పేరు స్థిరపడింది. మొత్తంమీద 108 ఆలయాలు నిర్మించబడిన తర్వాత కాశిలో నెలకొన్న శివుడు అప్పటినుంచి కాశీ విశ్వేశ్వరుడి రూపంలో ఉండిపోయాడు.కాశీ విశ్వేశ్వరుడు, కేదారేశ్వరుడు ఇక్కడ ఒకే ఆలయంలో ఉంటారు. ఇక్కటి పుష్పదంతేశ్వరాలయానికి తనదైన ప్రాముఖ్యత ఉంది. ఇది కాశీలో లేదు. కాశీని సందర్శించిన తర్వాత పుష్పదంతేశ్వరాలయానికి వచ్చి ఉత్తర పూజలు జరపకపోతే వారికి పుణ్యలోకాలు ప్రాప్తించవు అని ఇక్కడి వారి నమ్మకం.

కేదారేశ్వరాలయం ముందు దీపస్తంభం ఉంటుంది. ఈ ఆలయం సమీపంలో అస్థికలను సమాధి చేసేందుకు, నదిలో వదిలి పెట్టేందుకు నది పక్కన గట్లు ఉన్నాయి.

గమ్యమార్గాలు 
రోడ్డుమార్గంలో నందర్బార్ నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణిస్తే ప్రతికాశి వస్తుంది. నాసిక్, ముంబయ్, పుణె, సూరత్, ఇండోర్ నగరాలనుంచి బస్ సర్వీసులు లభ్యమవుతున్నాయి

సూరత్-భుశవాల్ రైలు మార్గంలో ఉండే నందర్బార్ రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరలో ఉంటుంది. 

సూరత్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉండే నందర్బార్ విమానాశ్రయం ఈ అలయానికి సమీప విమానాశ్రయం.

22 ఆగ, 2017

రాహువు

రాహువు స్త్రీ గ్రహం.ఇది ఛాయా గ్రహం. అపసవ్య మార్గాన నడుస్తుంది. అంటే మేషం, తరువాత మీనం ఇలా వెనక్కు నడుస్తుంది. రాహువు నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఈ మూడు నక్షత్ర జాతకులకు మొదటి దశ రాహుదశా శేషంతో ప్రారంభం ఔతుంది. రాహు దశాకాలం పద్దెనిమిది సంవత్సరాలు. సాధారణంగా రాహుదశాకాలంలో మనిషి జీవితంలో ఒడి దుడుకులు అధికం. కాని కొన్ని నక్షత్రాలకు కొంత వెసులు బాటు ఉంటుంది. రాహువుకు రాశిచక్రంలో ఇల్లు లేదు. రాహువు వృషభరాశిలో ఉచ్ఛస్థితి పొందుతాడు. రాహువు వృశ్చిక రాశిలో నీచ స్థితిని పొందుతాడు. కొన్ని ప్రాచీన గ్రంథాలలో జ్యోతిహ శాస్త్ర రాహువు ప్రస్తావన లేదు. కాని ఆధునిక శాస్త్రంలో రాహువుకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నారు. రాహువు పాపగ్రహం. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలను ఇస్తాడు. రాహువు శరీరం దిగువ భాగం పాము శరీరం ఉంటుంది. అందుకనే రాహువుకు విషముతో అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఎప్పుడూ రోదశీలో ఉండే సూర్యుడిని కొంత కాలం కనిపించకుండా చేస్తాడు కనుక కల్పనా జగత్తుకు ప్రతీకగా జ్యోతిష పండుతులు విశ్వసిస్తారు. కళాకారుల జీవితంలో రాహువు ప్రధాన పాత్ర పోషిస్తాడని జ్యోతిష శాత్ర పండితులు విశ్వసిస్తారు.
గుణగణాల
రాహువు తమోగుణ ప్రధానుడు, గ్రహ సంఖ్య రెండు, అధిదేవత గౌరి, ముసలి వారిని సూచిస్తాడు. బుధుడు, శుక్రుడు, శని మిత్రులు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు శత్రువులు. గురువు సముడు. స్వక్షేత్రం కుంభం, శత్రు క్షేత్రం సింహం, మిత్ర క్షేత్రం తుల. అసుర, బహి, స్వర్భాను, తమస అనేవి ఇతర నామాలు. జాతి మ్లేచ్ఛ, స్వాభావము క్రూరము, రుచులలో పులుపును సూచిస్తాడు. ప్రదేశం పాములు తిరిగే ప్రదేశం. దిక్కు నైరుతి, పాలనా శక్తి భటుడు, ఆత్మాధికారం కష్టాలు, లోహము సీసం, గృహ స్థానం ఉపయోగంలో లేని ప్రదేశం, గ్రహపీడ సంతాన లేమి, గ్రహం రాశిలో ఉండే కాలం ఒకటిన్నర సంవత్సరం. వృక్షము పొదలు, ఆహార పదార్ధాలు మినుములు, ఖర్జూరం, ఆవాలు. జంతువులు ఏనుగు, పాములు అడవి ఎలుకలు. వస్తువు గొడుగు, సమిధ దుర్వ, మూలిక చందనం, దేవ వర్గం శైవ, అవతారం వరాహావతారం.
కారకత్వం
రాహువు పితామహుడు (తాత), వృద్ధాప్యము, శ్వాస, భాష, అసత్యము, భ్రమ, వాయువు, విచారము, జూదము, కఫము, సంధ్యా సమయం, బయట ప్రదేశం, గొడుగు, పల్లకి, అపరి శుభ్రం, గొడుగు, పల్లకి, విమర్శ, అంటరాని తనం, నల్లులు, దోమలు, గుడ్లగూబలు, విషకీటకములను సూచిస్తాడు.
వృత్తులు :- విషసంబంధిత రసాయనాల తయారీ సంస్థలు, పాములు పట్టుట, భూతవైద్యము, శ్మశానంలో పని చేయుట, నాగ పూజ, దొంగతనం, వైద్య శాస్త్రం, గారడీ విద్యలు. శుక్రుడితో కలిసి ఉంటే సినీరంగం, నాటక రంగం, అడ్వర్టైజ్ మెంటు రంగం, బుధుడితో చేరిన రచయిత, గారడీ విద్య, శనితో చేరిన మోసపూరిత జీవితం, గురువుతో కలిసిన కపట గురువు మొదలైనవి. జైళ్ళు, క్రిమినల్ కోర్ట్లో ఉద్యోగాలు, ఎలెక్ట్రిక్‌సిటీ, ఆటోమొబైల్స్, గ్యాస్, ఇనుము, నిప్పుకు సంబంధించిన వృత్తులు. అగ్నిమాపక దళ వృత్తులను సూచిస్తాడు.
వ్యాధులు :- నులి పురుగులు, గుల్మ రోగం, అంతు చిక్కని రోగాలు మొదలైనవి. రాహువు ఏగ్రహంతో కలిసి ఉంటే ఆయాగ్రహ సంబంధిత రోగాలను ఇస్తాడు.
విద్యలు :- రాహువు ఏగ్రహముతో చేరిన ఆగ్రహ సంబంధిత విద్యలను సూచిస్తాడు.
రూపము
రాహువు క్రూర రూపము కలవాడు, పొడగరి, నల్లని మేని ఛాయ కలవాడు. నాలుగు భుజములు గలవాడు. కత్తి, త్రిశూలమును ధరించి కవచ ధారణ చేసి ఉంటాడు. సింహాన్ని అధిరోహించి ఉంటాడు. తండ్రి కశ్యపుడు, తల్లి సింహిక, భార్య కరాళ. పార్ధివ నామ సంవత్సరం బాధ్రపద శుక్ల పూర్నిమ నాడు పూర్వాభద్రా నక్షత్రములో జన్మించాడు. రాహువు క్షీర సాగర మధన సమయంలో దేవతా రూపం ధరించి మోహినీ చేతి అమృతపానం చేసాడు. దానిని సూర్య, చంద్రులు విష్ణుమూర్తికి చెప్పడంతో విష్ణువు అతడి తలను మొండెం నుండి వేరు చేయడంతో పాము శరీరం పొందాడు. విష్ణుమూర్తి అతడిని అనుగ్రహించి గ్రహ మండలంలో స్థానం కల్పించాడు. అప్పటి నుండి సూర్యచంద్రులకు శత్రువై గ్రహణ సమయాన కబళించి తిరిగి విడుస్తుంటాడని పురాణ కథనం వివరిస్తుంది. రాహువు రాక్షస నామ సంవత్సరం మాఘ కృష్ణ చతుర్ధశి ఆశ్లేష నక్షత్రంలో గ్రహజన్మను ఎత్తాడు.
రాహుకాలం
రాహు కాలం వారంలో ప్రతి రోజు ఒకటిన్నర గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆంటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులైతే ఆసమయంలో చేయరు. కాని దోష నివారణ కొరకు రాహుకాలంలో పూజలు నిర్వహిస్తారు. దుర్గాదేవికి రాహుకాలంలో నిమ్మడిప్పలో నూనె పోసి దీపం వెలిగిస్తారు. ఆది వారం సాయంత్రం 4 1/2 (నాలుగున్నర ) గంటల నుండి 6 గంటల వరకు, సోమ వారం ఉదయం 71/2 (ఏడున్నర) 9 వరకు, మంగళ వారం 3 గంటల నుండి 41/2 (నాలుగున్నర) గంటల వరకు, బుధ వారం 12 గంటల నుండి 11/2 (ఒకటిన్నర), గురువారం 1/2 గంటల నుండి 3 గంటల వరకు, శుక్ర వారం 10 1/2 గంటల నుండి 12 గంటల వరకు, శని వారం 9 గంటల నుండి 101/2 గంటల వరకు రాహుకాలం ఉంటుంది.
పరిహారం
రాహువును శాంతింప చేయడానికి చేయవలసిన పరిహార విధులు. ప్రతిమకు కావలసిన లోహము సీసం, ప్రతిమకు పూజకు గ్రహ ఆసనం చేట, సమిధ దూర్వ, నైవేద్యం మినప సున్ని, మినప గారెలు, ఖర్జూరం, చేయవలసిన పూజ అధిష్టాన దేవత అయిన సరస్వతి పూజ, దుర్గా పూజ, సుభ్రహ్మణ్య స్వామి పూజ, శివారాధన, రాహుకాలంలో దుర్గకు నిమ్మకాయ దీపం పెట్టడం. ఇది దేవాలయంలో దుర్గాదేవి సన్నిధిలో చేయాలి. ఇంట్లో అయితే నేతి దీపం పెట్టాలి.ఆచరించ వలసిన వ్రతం సరస్వతి వ్రతం, రాహువుకు ప్రియమైన తిథి చైత్ర బహుళ ద్వారశి, పారాయణ చేయవలసినవి రాహు అష్టోత్తరం, లలితా సహస్రనామం, ఆచరించవలసిన దీక్ష భవానీ దీక్ష, ధరించవలసిన మాల రుద్రాక్ష మాల, అష్టముఖ రుద్రాక్ష, రత్నము గోమేధికము, దర్శించవలసిన దేవాలయములు సరస్వతి, దుర్గ, సుభ్రహ్మణ్య స్వామి దేవాలయం, శివాలయాలు, నవగ్రహాలయాలు. దానం చెయ్యవలసినవి ఎండు ద్రాక్ష, తేనె, ఖర్జూరములు. చేయవలసిన జపసంఖ్య పద్దెనిమిది వేలు.
రాహువు స్థానాలు ఫలితాలు
రాహువు ఉన్న స్థాన ఫలితాలు రాహు మహర్ధశా కాలములో మాత్రమే ఫలితాలను ఇస్తాయి.
1. లగ్నము :- జాతక చక్రములో ప్రథమ స్థానాన్ని లగ్నము అంటారు. రాహువు ప్రథమ స్థానములో ఉన్న జాతకుడు సహాయగుణము కలిగి ఉంటాడు. ముఖము మీద మచ్చలు కలిగి ఉంటాడు. ధైర్యసాహసాలు ప్రదర్శించే వారుగా ఉంటారు.
2. ద్వితీయస్థానములో రాహువు ఉన్న జాతకుడు. నల్లని ఛాయగలవారు వివాహేతర సంబంధముల అందు ఆసక్తి కలవారుగా ఉంటారు.
3. రాహువు తృతీయ స్థానమున ఉన్న జాతకుడు క్రీడాకారుడు, ధనవంతుడు, సాహసికులు ఔతారు.
4. రాహువు చతుర్ధ స్థానమున ఉన్న జాతకుడు బహుభాషాకోవిదుడు ఔతాడు. తల్లికి కష్టాలు ఉంటాయి. విద్యల అందు ఆటంకం కలిగిస్తాడు.
5. రాహువు పంచమస్థానములో ఉన్న జాతకుడు క్రూరస్వభావము కలిగి ఉంటాడు. భ్రమలు అధికంగా ఉంటాయి. సంతానము కలగటములో ఆటంకములు కలిగిస్తాడు.
6. రాహువు షష్టమస్థానమున ఉన్న జాతకుడు శత్రురహితుడు ఔతాడు. పెద్ద బంధువర్గము కలిగి ఉంటాడు.
7. రాహువు సప్తమ స్థానమున ఉన్న జాతకుడు భోజనప్రియత్వము కలిగి ఉంటాడు. మధుమేహవ్యాధికి కారకుడు ఔతాడు. కళత్రానికి ఆరోగ్యసమస్యలు కలిగిస్తాడు.
8. రాహువు అష్టమ స్థానమున ఉన్న జాతకుడు పోట్లాడె గుణము కలిగి ఉంటాడు. సంకుచిత మనస్తత్వము కలిగి ఉంటాడు.
9. రాహువు నవమ స్థానమున ఉన్న జాతకుడు పిరికితనము కలిగి ఉంటాడు. తంద్రికి కష్టాలు ఉంటాయి.
10. రాహువు నవమస్థానమున ఉన్న జాతకుదు కళాకారుడు, కవి, రచయిత, యాత్రికుడు ఔతాడు.
11. రాహువు ఎకాదశమున ఉన్న జాతకుడు ధనసంపద కలిగి సమాజంలో గౌరవమర్యాదలు కలిగి ఉంటాడు.
12. రాహువు జాతకుడు ఉన్న జాతకుడు తాత్విక చింతన కలిగి ఉంటాడు. నేత్ర వ్యాధి కలిగి ఉంటాడు.
గోచార రాహువు ఫలితములు
1 . స్థానము :- రాహువు చంద్రుడు ఉన్న స్థానములో ఉన్నప్పుడు లెక ప్రవేశించినప్పుడు వ్యాధులు, రొగములు పీడించును. అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి ఉన్నందు వలన మానసిక వ్యాకులత కలుగును. శారీరక అలసట కలిగి ఉంటారు.
2. రాహువు చంద్రుడికి ద్వితీయ స్థానములో ప్రవేశించినప్పుడు అవవసర ధన వ్యయమును కలిగించి వ్యక్తిని ఆర్థిక ఇబ్బమ్దులకు గురి చేస్తాడు. కుటుంబము, సహసంబంధులతో కలతలు కలిగించును. కుటుంబ సభ్యుల మధ్య వివాదములు తలెత్తుతాయి. ఈ కాలము వ్యక్తిని మద్యము వంటి మత్తు పదార్ధములకు బానిసను చేస్తుంది కనుక జాగ్రత్త వహించుట మంచిది.
3. రాహువు తృతీయ స్థాన ప్రవేశము శుభఫలితాలను ఇస్తుంది. ఇతరులతో చేరి చతురతను ఉపయోగించి కార్యములు చక్కబెట్టుటకు ప్రయత్నము చేస్తారు. ఏ కార్యము చేసినా గుప్తముగా చేసి దానిని పూర్తి చేసిన తరువాతనే బహిర్గతము చేస్తారు.
4. రాహువు చతుర్ధ స్థాన ప్రవేశము అనేక సమస్యలను కష్తములను కలిగించును. రహువు నాలగ్వవ స్థాన ప్రవేశము తల్లికి కష్తములను కలిగించును. అడుగడునా కష్టములు, సమస్యలు ఎదురౌతూ అగౌరవము, అవమానము కలుగుతాయాన్న భయము సదా వెన్నంటి ఉంటుంది. భూమి వాహనము సంబంధించిన సమస్యలు ఎదురౌతాయి.
రాహువు పంచమస్థాన ప్రవేశము కష్టములు, దుఃఖము కలిగించును. మతిభ్రమను కలిగించును. త్వరగా ధనికుడు కావాలన్న పగటికలలు కంటూ ధనము కావలన్న లాలసలో ఉన్న ధనమును కోల్పోవదము జరుగుతుంది.
రాహువు షష్టమ స్థాన ప్రవేశము అంతగా హాని కలిగించక పోయినా ఆరోగ్యము మిద ప్రభావము చూపెట్టవచ్చు కనుక భోజన పానీయాలను తీసుకునే విషయములో శ్రద్ధవహించ వలసి ఉంది. ఉదర సంబంధిత సమస్యలు పీడిస్తాయి. ఈ సమయములో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆకస్మిక ధనలాభము వస్తుంది.
రాహువు సప్తమభావ ప్రవేశము దాంపత్య జీవితము బాధించును. భార్యాభర్తల మధ్య కలతలు పెరిగి దూరము కలగ వచ్చు. కళత్రానికి కష్టములు కలుగుతాయి. ఆరోగ్యకారనముగా దుఃఖిస్తారు. సహజమైన బుద్ధి కూడా సరిగా పని చెయ్యదు.
రాహువు అష్టమ స్థానప్రవేశము ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. పలువిధ రోగములు వస్తాయి. మూత్ర సంబంధిత వ్యాదులతో బాధపద వచ్చు. ఆర్థికమైన సమస్యలను ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులు ఆర్థిక నష్టము సంభవము.
రాహువు నవమ స్థాన ప్రవేశము తలపెట్టిన కార్యమౌలన్నింటా రాహువు ఆటంకములను కలిగించ వచ్చు. పనులు పూర్తికానున్న తరుణములో పనులు ఆగవచ్చు. అనవసర ఖర్చుల వలన ఆర్థికపరమైన చిక్కులు తలెత్తవచ్చు.
రాహువు దశమ స్థాన ప్రవేశము ఉద్యోగ బదిలీలకు కారణము ఔతుంది. అప్పటి వరకూ చేస్తున్న పనిని వదిలి వెరొక పని చేయవలసి ఉంటుంది. ఆర్థికపరమైన నష్టముకలగ వచ్చు. అనవసర శృఅమ ఫలితముగా అలసట కలగ వచ్చు.
రాహువు ఏకాదస స్థాన ప్రవేశము శూభఫలితాలను ఇస్తుంది. ఈ సమయములో గౌరవము, కీర్తి, ప్రతిష్ఠ కలగ వచ్చు. పాత దారులలో ఆదాయముతో కొత్త దారులలో కూడా ఆదాయము రావచ్చు. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. కార్యసఫలత కలుగుతుంది.
రాహువు ద్వాదశ స్థాన ప్రవేశము అనవసర ఖర్చులను కలగ చేస్తుంది. ఫలించని పగటి కలలను కలిగిస్తాయి. గాలిమేడలు కట్టడం ఊహాగానాల వలన ప్రయోజనము శూన్యము.
ద్వాదశస్థానములలో రాహువు
లగ్నంలో రాహువు ఉన్న జాతకుడు అల్పాయుస్షు కలవాడు, ధనం కలవాడు, దృఢమైన శరీరం కలవాడు, ముఖం శిరస్సు నందురోగములు కలవాడు, ఔతాడు.
ద్వితీయ స్థానమున రాహువు ఉన్న జాతకుడు అనుమానాస్పద పలుకులు చెప్పువాడు, నోటియందు రోగములు కలవాడు, సునిసిత హృదయుడు, రాజాశ్రయం చేత ధనం సంపాదించే వాడు, సుఖవంతుడు, రోషవంతుడు ఔతాడు.
తృతీయ స్థానమున రాహువు ఉన్న జాతకుడు గర్వం కలవాడు, సోదరులతో విరోధించు వాడు, స్థిరచిత్తుడు, చిరాయుష్మంతుడు, ధనవంతుడు ఔతాడు.
చతుర్ధ స్థానమున రాహువు ఉన్న జాతకుడు దుఃఖకారకుడు, మూర్ఖుడు, అప్పుడప్పుడూ సుఖపడే వాడు ఔతాడు.
పంచమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు ముక్కుతో మాట్ళాడినట్లు మాట్లాడు వాడు, పుత్రులు లేని వాడు, కఠినాత్ముడు, గర్భరోగములు కలవాడు ఔతాడు.
షష్టమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు శ్తృవుల చేత బాధలను అనుభవించువాడు, గ్రహపీడితుడు, గుర్తించ లేని రోగము కలవాడు, ధనవంతుడు, చిరంజీవి ఔతాడు.
సప్తమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు పరస్త్రీ లోలుడు, రోగగ్రస్థుడు, ఆత్మీయల ఎడబాటు వలన బాధలను అనుభవించు వాడు, తన భావములే గొప్పవని భావించే వాడు, మానవత్వం కోల్పోయిన వాడు, పాపం చేయువాడు ఔతాడు.
అష్టమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు అల్పాయుష్కుడు, అపవిత్ర కార్యాలు చేయువాడు, అంగవైకల్యం కలవాడు, వికల మనస్కుడు, వాత ప్రకృతి కలవాడు, అల్పసంతతి కలవాడు ఔతాడు.
నవమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు ప్రతికూల భావములు కలిగిన వాడు, కులపెద్ద, గ్రామ పెద్ద, పట్టణముకు అధిపతి, పాపక్రియాసక్తుడు, ఔతాడు.
దశమ స్థానమున రాహువు ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగిన వాడు ఔతాడు. అల్పసంతానవంతుడు, పరుల కార్యములు చేయు వాడు, నిర్భయుడు, సత్కర్మ రహితుడు ఔతాడు.
ఏకాదశ స్థానమున రాహువు ఉన్న జాతకుడు అభివృద్ధి చెందుతూ ఉంటాడు, స్వల్పసంతాన వంతుడు, చిరంజీవి, మరియు కర్ణ రోగి ఔతాడు.
ద్వాదశ స్థానమున రాహువు ఉన్న జాతకుడు రహస్యముగా దుష్కృత్యములు చేయువాడు, అధికంగా ఖర్చు చేయువాడు, శరీరమున జలసంబంధ రోగములు కలవాడు

19 అక్టో, 2012

నాజూకు గా ఉండడానికి కొన్ని ఆహారపదార్ధాలు

                                   
  ఆహారంలో ఎన్ని వర్ణాలుంటే అంత మంచిదంటారు! ముదురు రంగు ఆహారం, ముఖ్యంగా నలుపు వర్ణంలో ఉండే పదార్థాల్లో పోషకాలు అధికమనీ.. అవి బరువు తగ్గి, నాజూగ్గా మారడానికి ఉపయోగపడతాయని అంటున్నారు నిపుణులు.

1.బ్లాక్‌ టీ: శరీరానికి తగిన పోషకాలు అందిస్తూనే, 'సన్న'జాజిలా మారేందుకు దోహదం చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఐసోఫ్లవనాల్స్‌, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు దీనిలో పుష్కలం. తేయాకులని పులియబెట్టి ప్రత్యేక పద్ధతుల్లో తయారుచేసే దీనివల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు. శరీరంలోని ఒత్తిడి కలిగించే హార్మోన్లని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే ఓ కప్పు బ్లాక్‌టీ తాగితే ఈ సత్ఫలితాలు పొందవచ్చు.

2.నువ్వులు, 3.మిరియాలు: మాంసకృత్తులు, ఇనుము అధికంగా ఉండే నల్ల నువ్వులు అల్సర్లలని నివారించి, అతిసారాన్ని అదుపులో ఉంచుతాయి. క్యాల్షియం అధికంగా ఉండే నువ్వులని ఆరోగ్యం కోసం ఉదయాన్నే వేడి నీటితో కలిపి తీసుకోవడం చైనీయుల సంప్రదాయం. ఇక, నల్ల మిరియాల పొడి ప్రయోజనం చెప్పాలంటే... చర్మ, శిరోజ ఆరోగ్యాలకు పెట్టింది పేరు. చారు, ఫ్రైడ్‌రైస్‌, సలాడ్ల రూపంలో మిరియాల పొడిని తీసుకొంటే జీర్ణశక్తి పెరుగుతుంది. గుండె జబ్బులు, దంత సమస్యలు, కాలేయ ఇబ్బందుల నుంచి మిరియాలు సాంత్వననందిస్తాయి. వీటి నుంచి తీసిన నూనెను చర్మానికి, శిరోజాలకు వాడితే మంచిది.

4.నల్ల ద్రాక్ష: క్యాన్సర్‌తో పోరాడే శక్తి ఉంది. వీటిని దీర్ఘకాలం ఆహారంగా తీసుకుంటే, క్యాన్సర్‌ కణాలు తగ్గుముఖం పడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించి, చర్మానికి కొత్త నిగారింపునివ్వడంలోనూ నల్ల ద్రాక్షలు ఉపయోగపడతాయి. గింజలు లేని ద్రాక్షలో కన్నా గింజలున్న వాటిని తీసుకోవడం వల్ల ఎక్కువ యాంటీ ఆక్సిండెంట్లు అందుతాయి. నల్ల ద్రాక్ష, మిరియాల పొడి, నల్ల నువ్వుల కారం.. వీటిని తరచూ తీసుకునే వారిలో దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు పెద్దగా ఉండవని, లైంగిక సామర్థ్యం పెరుగుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

5.నల్లుప్పు: పచ్చళ్లలో వాడే నల్ల ఉప్పుకి శరీర జీవక్రియలని వేగవంతం చేసే శక్తి ఉంది. సైనస్‌తో బాధపడుతున్నప్పుడు ఇది మంచి సాంత్వన. అలాగే కీళ్లనొప్పులతో బాధపడేవారు ఓ వస్త్రంలో వేడి చేసిన ఈ ఉప్పుని ఉంచి సమస్య ఉన్న చోట పెడితే కాసేపటికి సాంత్వన లభిస్తుంది. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు గోరువెచ్చని నీటిలో వేసి పుక్కిలిస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

6.వెనిగర్‌: బియ్యం, గోధుమలు, జొన్నలు మేళవించి చేసిన బ్లాక్‌ వెనిగర్‌ని ఉపయోగించడం వల్ల రక్తప్రసరణ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. 
7. నీరు : రోజువారీ తగినంత మంచినీరు సుమారుగా 3 లీటర్లు త్రగాలి . 
8. పాలు : రోజూ పడుకునేటప్పుడు ఒక గ్లాసు వెన్నతీసిన పాలు త్రగితే శరీరము గాజూకుగా తయార్గును. 
9.తేనె : రొజూ రెండు స్పూనుల తేనె ఉదయానే ఒక స్పూను అల్లం రసములో కలిపి తీసుకుంటే చర్మానికి మంచి రంగు వస్తుంది. ఆంబపైత్యము పోయి, విరోచనము సాఫీగా అవుతుం
ది. 

అధికబరువు, ఎసిడిటీ, బి.పి తగ్గించి వ్యాధి నిరోధకశక్తి పెంచే చిట్కాలు.

                     Photo: అధికబరువు, ఎసిడిటీ, బి.పి తగ్గించి వ్యాధి నిరోధకశక్తి పెంచే చిట్కాలు.
ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తీసుకుని అందులో ఒక టీస్పూన్ తేనె, ఒక చెక్క నిమ్మరసం కలుపుకుని రోజు ఉదయాన్నే తాగుతుంటే అధిక బరువుని నివారించవచ్చు.  ఇలా తాగడం వలన కడుపు నొప్పి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.

రోజూ ఉదయాన్నే పరగడుపున కొంచెం నీళ్ళల్లో తేనె కలుపుకుని తాగితే కిడ్నీలు బాగా పనిచేస్తాయి, వ్యాది నిరోధక శక్తి పెరుగుతుంది.

ఎసిడిటితో బాధపడుతుంటే క్యారెట్, దోస, ముల్లంగి, బీట్ రూట్ లలో ఏదైనా జ్యూస్ తీసుకుని అందులో చిటికెడు ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. జీలకర్రతో షర్బత్ చేసుకుని తాగినా ఎసిడిటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

అధిక రక్తపోటు ( హై బీపి ) తో బాధపడేవారు ఉసిరి రసం, తేనె సమపాళ్ళల్లో తీసుకుని కలిపి ప్రతిరోజూ ఉదయం ఒక టేబుల్ స్పూన్  తాగితే బీపి అదుపులో ఉంటుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తీసుకుని అందులో ఒక టీస్పూన్ తేనె, ఒక చెక్క నిమ్మరసం కలుపుకుని రోజు ఉదయాన్నే తాగుతుంటే అధిక బరువుని నివారించవచ్చు. ఇలా తాగడం వలన కడుపు నొప్పి
 నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.

రోజూ ఉదయాన్నే పరగడుపున కొంచెం నీళ్ళల్లో తేనె కలుపుకుని తాగితే కిడ్నీలు బాగా పనిచేస్తాయి, వ్యాది నిరోధక శక్తి పెరుగుతుంది.

ఎసిడిటితో బాధపడుతుంటే క్యారెట్, దోస, ముల్లంగి, బీట్ రూట్ లలో ఏదైనా జ్యూస్ తీసుకుని అందులో చిటికెడు ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని తాగితే ఫలితం ఉంటుంది. జీలకర్రతో షర్బత్ చేసుకుని తాగినా ఎసిడిటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

అధిక రక్తపోటు ( హై బీపి ) తో బాధపడేవారు ఉసిరి రసం, తేనె సమపాళ్ళల్లో తీసుకుని కలిపి ప్రతిరోజూ ఉదయం ఒక టేబుల్ స్పూన్ తాగితే బీపి అదుపులో ఉంటుంది.

3 అక్టో, 2012

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

చేసేది చిన్న ఉద్ద్యోగం. రోజూ పని చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. అటువంటి స్థితిలో అనారోగ్యంతో మంచం పట్టాడు. రెండు కిడ్నీలు చెడిపోయాయి. వారానికి రెండుసార్లు డయాలసిస్‌ చేయించుకోవాల్సి వస్తోంది. తనపై ఆధారపడ్డ కుటుంబ పోషణ, మరోవైపు వైద్యానికి డబ్బుల్లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయనే హైదరాబాద్ మల్కాజ్గిరి కి చెందిన ప్రసాద్
 ఉన్నంతలో కుటుంబాన్ని పోషించుకునేవాడు. జీవితం సాఫీగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా ఏడాది క్రితం అనారోగ్యం బారిన పడ్డాడు. ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంటే ఒక కిడ్నీ పూర్తిగా చెడిపోయిందని, రెండోకిడ్నీ ప్రాథమిక దశలో ఉఉన్నందున కిడ్నీ మార్చడం అనివార్యమని డాక్టర్లు సూచించారు. కిడ్నీ మార్పు చేసేందుకు సుమారు ఆరు లక్షల రూపాయలు ఖర్చవుతుందని, అప్పటి వరకు వారానికి రెండు సార్లు డయాలసిస్‌ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో వారానికి రెండు సార్లు గాంధీ ఆస్పత్రిలో ప్రసాద్ డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్‌ ఉచితంగానే చేస్తున్నా మందుల కోసం నెలకు రూ. 10 వేల వరకు ఖర్చవుతోంది.  డయాలసిస్‌ కూడా ఎక్కువ రోజులు చేయించుకోరాదని, త్వరగా కిడ్నీ మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారని, కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న సమయంలో ఆరు లక్షల రూపాయలు ఎక్కడి నుండి తీసుకొచ్చేదని బాధితుడు వాపోతున్నాడు. తనకు ఎవరైనా దాతలు సహకరించి ఆర్థిక సాయం చేస్తే చికిత్స చేసుకునేవీలుందని వేడుకుంటున్నాడు. మరి దాతలు ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకురావాలని కోరుకుందాం.
సంప్రదించండి: ప్రసాద్  సెల్ న: 09701964593
s.verra prasad
a/c no  860210110005041
Bank of india,Malkajgiri branch
Andhra pradesh

25 జులై, 2012

నాని ఎఫెక్ట్: ఫ్యాన్స్ భయంతో వెళ్లని ఎన్టీఆర్

కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వ్యవహారం హీరో జూనియర్ ఎన్టీఆర్‌కి తీవ్ర ఇబ్బందులనే కలిగిస్తోందని అంటున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జై కొట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తన విజయవాడ పర్యటన కూడా రద్దు చేసుకున్నారట.

జూనియర్ ఎన్టీఆర్ ఓ జ్యూవెల్లరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ జ్యూవెల్లరీ కంపెనీ విజయవాడలో ఆదివారం ఓ షోరూంను ప్రారంభిస్తోంది. అక్కడ జూనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఫాలోయింగ్ ఉంది. దీంతో అతని చేతనే ఈ దుకాణాన్ని ఓపెనింగ్ చేయించేందుకు ఆ కంపెనీ నిర్ణయించుకుంది. జూ.ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఆ కంపెనీ ప్రకటనలలో మాత్రమే కనిపించారు. ఏ దుకాణాన్ని ఓపెన్ చేయలేదు.

అయితే విజయవాడలో ఓపెనింగ్‌కు మాత్రం ఆయన అంగీకరించారట. ఈ జిల్లాతో తనకు వ్యక్తిగతంగా ఉన్న సంబంధాలు, సెంటిమెంట్ వంటి వాటి కారణంగా ఓపెనింగ్‌కు జూనియర్ అంగీకరించారట. అయితే చివరి నిమిషంలో జూనియర్ తన విజయవాడ పర్యటనను రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. తాను మరో మూడు నెలల వరకు అందుబాటులో ఉండలేనని, కాబట్టి తాను లేకుండానే దుకాణాన్ని ప్రారంభించుకోవాలని కంపెనీ యజమానులకు విజ్ఞప్తి చేశారట.

జూనియర్ సున్నితంగా తిరస్కరించడంతో ఆ కంపెనీ ప్రముఖ బాలీవుడ్ మాజీ నటి, బిజెపి ఎంపి హేమమాలినిచే ఆ దుకాణాన్ని ప్రారంభింప చేయనుంది. అయితే జూనియర్ వెనక్కి తగ్గడం వెనుక నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు ఎక్కడ అడ్డుకుంటారోననే ఆందోళనతోనే అని అంటున్నారు. కొడాలి నాని వ్యవహారం తర్వాత జిల్లాకు చెందిన నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు జూనియర్ పైన గుర్రుగా ఉన్నారట.

ఇప్పటికై నాని జగన్ వైపు వెళ్లారు. జూనియర్‌కు సన్నిహితుడిగా ముద్రపడ్డ మరో నేత వల్లభనేని వంశీ వ్యవహారంపై కూడా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఆయన పార్టీలో ఉంటారో ఉండరో అనే అనుమానాలు వారిని వెంటాడుతున్నాయట. తనకు సన్నిహితులుగా ముద్రపడిన వారిలో ఒకరు ఇప్పటికే వెళ్లడం, మరొకరిపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో విజయవాడ వెళితే అభిమానుల నుండి ఆగ్రహం చవి చూడాల్సి వస్తుందని జూనియర్ భావించి ఉంటారని అంటున్నారు.

గుప్త నిధి వేట: కిడ్నాప్ కథలో చిరు గన్‌మన్నిజామాబాద్ జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసిన ఉదంతంలో నలుగురు ప్రత్యేక రక్షణ దళానికి చెందిన పోలీసులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. వ్యాపారి వద్ద గుప్త సంపద ఉందనే ఉద్దేశంతో అతన్ని వారు కిడ్నాప్ చేసి వేధించారు. ఆ నలుగురిలో ఒకతను రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గన్‌మన్ కాగా, మరొకతను ఐపియస్ ఆఫీసర్ శివశంకర్ గన్‌మన్.

ఆ నలుగురు పోలీసులకు సహకరించిన మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో పాలు పంచుకున్న పోలీసులు నలుగురు - అద్దంకి సీతారాములు, ఉప్పల శ్రీనివాస్, వనం హరిబాబు, జి. గోపాల్. బాధితుడు కోనేరు కృష్ణను ఆ నలుగురు పోలీసులు జులై 11వ తేదీన పిట్లం గ్రామం నుంచి కిడ్నాప్ చేసి హైదరాబాదుకు తరలించినట్లు సమాచారం. దాచిన గుప్త ధనం వివరాలు చెప్పారని వారు కోేరు కృష్ణను వేధించారని చెబుతున్నారు.

పిట్లం అటవీ ప్రాంతంలో కోనేరు కృష్ణకు భారీ గుప్త నిధి దొరికిందని, దాన్ని అతను దాచి పెట్టాడని అదే గ్రామానికి చెందిన ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి నిందితులకు చెప్పాడని సమాచారం. నలుగురు ఎపిఎస్‌పి పోలీసులతో పాటు పది మందితో కూడిన ముఠా కృష్ణను ఆ నిధి కోసం వేధించిందని అంటున్నారు. వారి వేధింపులు భరించలేక నిధిని తన ఇంట్లోనే దాచినట్లు కృష్ణ చెప్పాడట.

దాంతో కృష్ణను వారు పిట్లం తీసుకుని వచ్చి నిధి కోసం వేట సాగించారు. అది లభించకపోవడంతో వారు అతన్ని వేధించడం ప్రారంభించారు. ఈ సమయంలో కృష్ణ అలారం మోగించాడని, దాంతో ఇరుగుపొరుగువారు వచ్చారని, దాంతో నిందితులంతా పారిపోయారని అంటున్నారు. తమకు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిని అరెస్టు చేశామని బాన్స్‌వాడ సిఐ ప్రకాష్ యాదవ్ చెప్పారు.

నిందితుల్లో సీతారాములు చిరంజీవి సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నాడని, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ఐపియస్ అధికారి శివశంకర్ గన్‌మన్ అని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. గోపాల్ గతంలో ముఖ్యమంత్రి సెక్యురిటీ వింగ్‌లో పని చేశాడు. హరిబాబు కొండాపూర్ బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. ఈ నలుగురిని సస్పెండ్ చేశారు.

జూ.ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ కూడా ఆశ్చర్యపోయారు
హైదరాబాద్:తారక్(ఎన్టీఆర్),కళ్యాణ్ రామ్ కూడా పూర్తిగా సర్పైజ్ అయ్యారు...మేము బాలకృష్ణను మంచు మనోజ్ సినిమాలో చేయటానికి ఒప్పించినందుకు అంటూ గర్వంగా చెప్తున్నారు మంచు లక్ష్మి ప్రసన్న. ఆమె నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటిస్తూ ఇలా స్పందించారు. అలాగే బాలకృష్ణ పోషించిన పాత్ర సినిమాలో బాగా ఎలివేట్ అయ్యింది. అందరూ మా నాన్నగారు మోహన్ బాబు ని ఈ సినిమాలో ఆ పాత్రకు తీసుకుంటామనుకున్నారు. కానీ బాలకృష్ణ ని తీసుకోవటం అందరకీ ఆశ్చర్యమనిపించింది. ఆ ఆశ్చర్యపోయే ఫాక్టరే సినిమాకు క్రేజ్ తెచ్చింది అన్నారామె.

నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ నటించిన 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' ఆగస్టు 2న కాకుండా వారం రోజులు ముందుగానే అంటే
అలాగే ...'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' 27వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. నాలుగేళ్ల మా టీమ్ కల నిజమవుతోంది. మా టీమ్ ని ఎంకరేజ్ చేయండి అని ట్వీట్ చేసారు. అలాగే మా సినిమా కు విపరీతమైన క్రేజ్ రావటంతో డిస్ట్రిబ్యూటర్స్ ప్రింట్స్ పెంచమని అడుగుతున్నారు అన్నారు. ఇది ప్రింట్స్ పెంచటం అనేది పూర్తిగా డిస్ట్రిబ్యూటర్స్ ఛాయిస్ అని మంచు మనోజ్ ఈ సందర్భంగా చెప్పారు.

బాలకృష్ణ ఈ ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ...'శ్రీరామరాజ్యం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం. ఓ వరం' అని అన్నారు. అలాగే ఊ కొడతా రా... ఉలిక్కి పడతారా చిత్రం భారీ ఎత్తున తెరకెక్కిం దన్నారు. ఈ చిత్రాన్ని మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్నారన్నారు. తండ్రి మోహన్‌బాబు క్రమశిక్షణను పునికి పుచ్చుకున్న లక్ష్మీప్రసన్న ఈ చిత్రా న్ని ఖర్చుకు వెనుకాడకుండా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు.

ఈ చిత్రం కోసం రూ.6 కోట్ల వ్యయంతో గంధర్వ మహల్ సెట్‌ను వేసినట్లు చెప్పారు. మంచు మనోజ్ మరో హీరోగా చక్కగా నటించారని బాలకృష్ణ ప్రశంసించారు. ఊ కొడతారా... ఉలిక్కి పడతారా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే చిత్రం అవుతుందన్నారు. ఇక బాలకృష్ణ రీసెంట్ గా నటించిన అధినాయకుడు చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంతో ఆయన మళ్లీ హిట్ జోన్ లోకి వెళ్తారంటున్నారు.

విజయమ్మ ఊ కొట్టారు, వారు ఉలిక్కిపడ్డారువైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సిరిసిల్ల ధర్నాకు ఆటంకాలు ఏర్పడకుండా భద్రతా ఏర్పాట్లు చేయడంపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మండిపడుతున్నారు. లగడపాటి రాజగోపాల్ వంటి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మాత్రం హర్షిస్తున్నారు. అందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరింత పుంజుకుంటే తమ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు భావిస్తుండగా, తెలంగాణవాదాన్ని దెబ్బ కొట్టడానికి విజయమ్మ ధర్నా పనికి వస్తుందని సీమాంధ్ర నాయకులు భావిస్తున్నారు.

విజయమ్మ ధర్నాపై కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి తీరుపై పరోక్ష వ్యాఖ్యలు చేయగా, వి. హనుమంతరావు నేరుగానే ముఖ్యమంత్రి తీరును తప్పు పట్టారు. భారీ భద్రత కల్పించి విజయమ్మను సిరిసిల్లకు పంపడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోవర్టులున్నారని, వారిని ఏరివేయకుంటే ప్రమాదమని ఆయన అన్నారు. వీసా తీసుకుని తెలంగాణలోకి రావాల్సి ఉంటుందని విజయమ్మ భర్త వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారని, ఇప్పుడు ఎవరి వీసా తీసుకుని విజయమ్మ తెలంగాణకు వచ్చారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విజయమ్మకు వీసా ఇచ్చారా అని ఆయన అడిగారు.

సీమాంధ్రలో సామాజిక న్యాయం జరగాలని తాము కడప జిల్లాకు వెళ్తే తమకు రక్షణ కల్పిస్తారా అని వి. హనుమంతరావు అడిగారు. విజయమ్మకు అంత భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అడిగారు. తెలంగాణకు చెందిన ఇతర కాంగ్రెసు నాయకులు కూడా విజయమ్మ దీక్షకు ముఖ్యమంత్రి కల్పించిన భద్రతను తప్పు పడుతున్నారు.

ఇప్పటి వరకు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు మధ్య పోటీ ఉంటూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి పడిపోవడంతో తమకు ఎప్పటికైనా ఢోకా ఉండదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు భావిస్తూ వచ్చారు. అయితే, పరకాల ఉప ఎన్నిక తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసుకు పెద్ద సవాల్‌ను విసురుతుందనే విషయాన్ని గమనించారు. తెరాసకు, వైయస్సార్ కాంగ్రెసుకు మధ్య పోటీ నెలకొనే పరిస్థితులు వస్తే, తమ ఉనికి గల్లంతవుతుందనే ఆందోళనతో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు ఉన్నారు.

పైగా, తెలంగాణ ప్రాంతంలో మరింత బలం పుంజుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే సిరిసిల్లలో విజయమ్మ ధర్నా తలపెట్టారనే అభిప్రాయం ఉంది. తెలంగాణలో వైయస్ విజయమ్మ ఇలా కార్యక్రమాలు నిర్వహించుకుంటు పోతే కాంగ్రెసు తెలంగాణలో కూడా తీవ్రంగా దెబ్బ తినే పరిస్థితులు వస్తాయి. తాము వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు అటుంచి, కనీసం పోటీ ఇచ్చే స్థితిలో కూడా ఉండబోమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు భావిస్తున్నారు. 

తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మొదటి నుంచీ వైయస్ జగన్‌ను వ్యతిరేకిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు చేతిలో తాము దెబ్బ తినే ప్రమాదం ఏర్పడుతుందని వారు భావిస్తున్నారు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి తీరును వారు తప్పు పడుతున్నారు. ఏమైనా, తెలంగాణలో కూడా కాంగ్రెసు ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు పొంచి ఉన్నాయనే అంచనాలు సాగుతున్నాయి.

జగన్ ఎంట్రీతో వెన్నులో వణుకు: కెసిఆర్ సైలెన్స్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వడం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెన్నులో వణుకు పుట్టిస్తోందని అంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో పరకాల నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థి జగన్ పార్టీ నేత కొండా సురేఖ చేతిలో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలుపొందారు. పరకాలలో తన సత్తా తేలడంతో జగన్ తెలంగాణలోనూ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. అందుకే తన తల్లి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత దీక్ష తలపెట్టారు.

ఆమె ఈరోజు(సోమవారం) తన దీక్ష కోసం సిరిసిల్ల వెళుతుండగా ముందుగా హెచ్చరించినట్లుగానే తెరాస కార్యకర్తలు ఆమెను అడుగడుగునా అడ్డుకున్నారు. రెండు రోజుల ముందు నుండే విజయమ్మ దీక్షపై తెరాస సిరిసిల్లలోను, హైదరాబాదులోనూ హంగామా చేసింది. విజయమ్మ దీక్ష కోసం ఆ పార్టీ కార్యకర్తలు కట్టిన జగన్, విజయమ్మల ఫ్లెక్సీలను, కటౌట్‌లను చించి వేశారు. మరోవైపు తెరాస ఎమ్మెల్యేలు కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు, ఈటెల రాజేందర్ సహా పలువురు ముఖ్య నేతలు వైయస్సార్ కాంగ్రెసుపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు.

తెలంగాణ తీవ్రంగా నష్ట పోవడానికి కారణం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డియేనని, ఇప్పుడు ఆయన సతీమణి తెలంగాణకు వస్తే ఎలా రానిస్తామని, వైయస్ గతంలో చెప్పినట్లుగా విజయమ్మ ఏ వీసా తీసుకొని సిరిసిల్లకు వస్తున్నారని వారు జగన్ పార్టీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం ఎక్కడా కనిపించక పోవడం గమనార్హం.

నిన్న మొన్నటి వరకు ఆగస్టు లేదా సెప్టెంబరులో తెలంగాణ వస్తుందని, అలా తనకు సంకేతాలు ఉన్నాయని చెప్పిన కెసిఆర్ ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. విజయమ్మ సిరిసిల్ల పర్యటన పైన ఇప్పటి వరకు ఆయన స్పందించలేదు. అయితే మూడు నాలుగు నెలల్లో తెలంగాణ వస్తుందని కెసిఆర్‌కు అంతగా విశ్వాసం ఉన్నప్పుడు విజయమ్మను అడ్డుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. విభజనపై ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా తెలంగాణే వచ్చే అవకాశమే ఉంటే ఇక సమైక్యవాదులను అడ్డుకోవడంలో అర్థమే లేదంటున్నారు.

తెరాస విజయమ్మను అడ్డుకోవడం చూస్తుంటే కెసిఆర్ చెప్పినట్లుగా మూడు నాలుగు నెలల్లో తెలంగాణ వచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఆయన మరోమారు తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే ఇలాంటి ప్రకటన చేసి ఉంటారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో బిజెపి గెలుపు, పరకాలలో జగన్ ప్రభంజనం కెసిఆర్‌కు ముచ్చెమటలు పట్టించిందని అంటున్నారు.

తెలంగాణకు గట్టిగా మద్దతిస్తున్న ఏకైక జాతీయ పార్టీ బిజెపి. అలాంటి బిజెపి పాలమూరులో గెలిచినప్పుడు తెరాస సాదరంగా ఆహ్వానించలేదని, ఆ పార్టీని తెలంగాణలో నిలదొక్కుకోకుండా చేసేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదంటున్నారు. కెసిఆర్‌కు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే సీట్ల కోసం కాకుండా ప్రత్యేక రాష్ట్రం కోసం పాలమూరు గెలుపు తర్వాత కూడా బిజెపితో కలిసి వెళ్లేవారని, కాని ఓట్లు సీట్లే లక్ష్యంగా ఉన్న కెసిఆర్ మాత్రం ఆలా చేయలేదని అంటున్నారు.

తెలంగాణకు అనుకూలంగా లేనప్పటికీ జగన్ పార్టీ ఇక్కడ తన సత్తా చాటుకోవడంతో ఇప్పుడు ఆ పార్టీని నిలదీసే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. పాలమూరులో బిజెపి గెలుపు తర్వాత మిగిలిన పార్టీల కంటే ఆ పార్టీనే టిఆర్ఎస్ టార్గెట్ చేసుకుందని, అయితే పరకాలలో బిజెపి దరావత్తు కోల్పోవడంతో ఆ పార్టీ అంతగా ప్రభావం చూపలేదని గ్రహించిన తెరాస దానిని వదిలి, తమకు ముచ్చెమటలు పట్టించిన జగన్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నదని అంటున్నారు. అంతకుముందు కూడా తెలంగాణలో బలంగా ఉన్న టిడిపిని దెబ్బ తీసిందని చెబుతున్నారు.

మొన్న తెలంగాణలో గట్టి క్యాడర్ ఉన్న టిడిపిని, నిన్న గెలుపు ఉత్సాహంలో ఉన్న బిజెపిని, తాజాగా ప్రభంజనం సృష్టిస్తామని భావిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీని లక్ష్యంగా చేసుకోవడం వెనుక తెలంగాణలో గత పదేళ్లుగా ఉన్న తమ ప్రాభవాన్ని కాపాడుకునేందుకే తప్ప, తెలంగాణ కోసం మాత్రం కాదనే విమర్శలు వస్తున్నాయి. విజయమ్మ దీక్షపై తెరాస ఇంత హడావుడి చేస్తుంటే కెసిఆర్ ఇప్పటి వరకు బయటకు రాకపోవడం కూడా చర్చనీయాంశమైంది.

రామ్ చరణ్ ఫ్యాన్స్ కు భాధకలిగించే వార్త


హైదరాబాద్:రామ్ చరణ్ ఫ్యాన్స్ అతని తదుపరి చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ 2012 సంవత్సరం కేవలం రామ్ చరణ్ రచ్చ మాత్రమే విడుదలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్ధితి ఉందని తెలుస్తోంది. చరణ్ నటిస్తున్న మూడు చిత్రాలు వచ్చే సంవత్సరం అంటే 2013 లో విడుదల కానున్నాయి. ఈ చిత్రాల్లో మొదట వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సంక్రాంతికి విడుదల కానుందని సమాచారం. మిగతా రెండూ ఆ తర్వాత రెండు నెలల గ్యాప్ లో విడుదల అవుతాయి.

ఒకేసారి మూడు సినిమాల్లో చేయటం వల్ల ఈ సమస్య వచ్చిందంటున్నారు. హిందీ రీమేక్ జంజీర్,వినాయిక్ తో చెర్రి,వంశీ పైడిపల్లితో ఎవడు చిత్రాలు రామ్ చరణ్ చేస్తున్నాడు. జంజీర్ విషయానికి వస్తే..''ఈ సినిమా నాకో సవాల్‌. తప్పకుండా ఈ సినిమాతో అందరి అంచనాలను అందుకొంటాను. బిగ్‌బి పోషించిన పాత్ర నాకు దక్కడం సంతోషంగా ఉంది'' అని రామ్ చరణ్‌ చెప్పారు. ఆయన తాజాగా హిందీలో ఆనాటి సూపర్ హిట్ 'జంజీర్‌'రీమేక్ చేస్తూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. 'జంజీర్‌'రీమేక్ చేయటం ద్వారా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న రామ్ చరణ్..పాత్రను ఛాలెంజ్ గా తీసుకున్నానని చెప్తున్నారు.

రామ్‌చరణ్‌ సరసన ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్‌లో షూటింగ్ జరుగుతోంది. రామ్ చరణ్‌, ప్రకాష్‌రాజ్‌లపై పోరాట సన్నివేశాల్ని చిత్రిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. చిరుత చిత్రం కూడా బ్యాంకాక్ లోనే షూటింగ్ జరగటంతో ఈ చిత్రం కూడా బ్యాంకాక్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇక వినాయిక్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి చెర్రీ అనే పేరు పెడుతున్నట్లు సమాచారం. ఇందులో బ్రహ్మానందం పాత్ర జిలేబి. ఈ పాత్ర చుట్టూ కామెడీతో రన్ అవుతుందని చెప్తున్నారు. రెండు పాత్రల్లో రామ్ చరణ్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. రౌడీ అల్లుడు తరహాలో కామెడీతో ఈ సినిమా సాగుతుందంటున్నారు. అదుర్స్స,రవితేజ కృష్ణ కలిపితే ఈ చిత్రం అవుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

రెండు వైయస్ విగ్రహాలకు నల్ల రంగు: పాలతో అభిషేకం
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు నగరంలోని రెండు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు నల్ల రంగు పులిమారు. సోమవారం తెల్లవారుజామున దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ రోడ్డులో ఉన్న విగ్రహానికి నల్ల రంగు వేశారు. అలాగే పంజాగుట్ట చౌరస్తాలోని విగ్రహం పైకి తారును విసిరారు.

దుండగులు విగ్రహం పైకి తారును విసురుతున్న సమయంలో పోలీసులు సమీపంలో ఉన్నారు. అది గమనించిన పోలీసులు వారిని వెంబడించడంతో పారిపోయారు. అయితే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు తారు పడిన ప్రదేశాన్ని వెంటనే శుభ్రం చేయించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. విషయం తెలిసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు విగ్రహాలకు పాలాభిషేకం చేశారు.

కాగా వైయస్ విజయమ్మ సోమవారం సిరిసిల్లలో చేనేత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఆమె దీక్షను అడ్డుకుంటామని తెలంగాణవాదులు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు హెచ్చరించారు. అన్నట్లుగానే విజయమ్మ ఉదయం హైదరాబాదు నుండి బయలుదేరినప్పటి నుండి సిరిసిల్ల వరకు పలుచోట్ల ఆమె కాన్వాయ్‌ని అడ్డుకున్నారు.

నగరం దాటే వరకు మూడు నాలుగు సార్లు ఆపిన తెలంగాణవాదులు, సిద్దిపేట దాటిన తర్వాత సిరిసిల్లకు వెళ్లే దారిలో విజయమ్మ కాన్వాయ్‌ను ఆపే క్రమంలో భాగంగా రణరంగాన్ని తలపించింది. ఆమె కాన్వాయ్ పైకి రాళ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లు విసిరారు. విజయమ్మ దీక్ష నేపథ్యంలో జిల్లాలో ఓ చోట వైయస్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేసారు.


బాలకృష్ణ కేసు : రాఘవేంద్రరావుకి కోర్టు నోటీసులు

హైదరాబాద్ : చిన్న చిత్రాల దర్శకుడు బాలకృష్ణ వేసిన కేసుకు సంబంధించి రాష్ట హైకోర్టు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు నోటీసులు జారీ చేసింది. సినీ మాక్స్ స్థలం వివాదంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ కేసు విచారణను మరో రెండు వారాలు వాయిదా వేసింది.

ప్రభుత్వం కేటాయించిన స్థలంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడంపై ఈ నోటీసులు జారీ అయ్యాయి. అదే విధంగా ప్రభుత్వానికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. రాఘవేంద్రరావు నిబంధనలకు విరుద్ధంగా జూబ్లీ హిల్స్‌లో సినీమాక్స్ కాంప్లెక్స్ కట్టారని, ప్రభుత్వాన్ని మోసం చేసి వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తూ సినీ దర్శకుడు బాలకృష్ణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

వాస్తవానికి రాఘవేంద్రరావు సినీ పరిశ్రమకు ఉపయోగ పడే స్టూడియో కడతానని చెప్పి కోట్ల విలువైన భూమిని కారు చవకగా దక్కించుకున్నాడని, నిబంధనల ప్రకారం ఆ స్థలంలో సినీ స్టూడియో లాంటివి మాత్రమే నిర్మించాలి.. కానీ రాఘవేంద్రరావు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాఘవేంద్రరావు నిబంధనలు అతిక్రమించాడని రుజువైతే ప్రభుత్వం ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.

కోర్టు నోటీసుల నేపథ్యంలో రాఘవేంద్రరావు న్యాయ నిపుణుల సహకారంతో వివరణ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. మరి ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో..? సినీ మాక్స్ స్థలం తన చేతి నుంచి జారి పోకుండా ఎలా కాపాడుకుంటాడో చూడాలి.

కూతురు సితార కోసం మహేష్ బాబు బ్రేక్...


మహేష్ బాబు, నమ్రత దంపతులు మూడు రోజుల క్రితమే పాపాయికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు ‘సితార' అనే పేరు కూడా పెట్టేశారు. పాపాయి పుట్టిన ఆనందంలో ఉన్న మహేష్ బాబు సినిమాలకు కొంత కాలం బ్రేక్ వేయాలని నిర్ణయించుకున్నాడు. మరో రెండు వారాల పాటు ఆయన ఏ షూటింగులోనూ పాల్గొనకుండా ఇంటిపట్టునే ఉంటూ సితారతో గడపాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి డాక్టర్లు నమ్రతకు జులై 26న డెలివరీ డేట్ ఇచ్చారట. అయితే అంతకంటే ఆరు రోజుల ముందుగానే...అందులోనూ శ్రావణ శుక్రవారం సితార జన్మించడంతో మహేష్ దంపతులు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఇల్లు బంధువుల హడావుడితో సందడిగా మారింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో మహేష్ బాబుకు సంబంధించిన షూటింగ్ మరికొన్ని రోజులు వాయిదా పడింది. ఈ గ్యాప్ లో ఇతర తారాగణంపై సీన్ల చిత్రీకరణ చేయాలని నిర్ణయించినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీ స్టారర్ చిత్రంలో మహేష్ బాబు, వెంకటేష్ లీడ్ రోల్స్ చేస్తుండగా మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుధ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాధ తట్టుకోలేకున్నా: జగన్‌పై మోహన్ బాబుహైదరాబాద్: తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశానని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంగళవారం అన్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు కలిశారు. అనంతరం ఆయన జైలు బయట విలేకరులతో మాట్లాడారు.

తాను జైలులో తన మేనల్లుడు జగన్‌ను, అత్యంత సన్నిహితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌లను కలిశానని చెప్పారు. వారిని చూసి తన గుండె బరువెక్కిందని, ఆ బాధ తట్టుకోలేక పోతున్నానని, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదన్నారు. జగన్‌కు త్వరలో మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతున్నట్లుగా ఉందన్నారు.

మహాభారతంలో శకుని ఒక్కడేనని, కానీ ఇప్పుడు మాత్రం ఢిల్లీలో ఎందరో శకునులు ఉన్నట్లుగా ఉందని సెటైర్లు వేశారు. ఎందరు ఎన్ని ఎత్తులు జిత్తులు వేసినా చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తుందని చెప్పారు. ఢిల్లీ పెద్దల కుయుక్తులతోనే జగన్‌కు ఈ దుస్థితి అన్నారు. త్వరలో జగన్, నిమ్మగడ్డ బయటకు రావాలని తాను షిరిడీ సాయినాథుని కోరుకున్నానని అన్నారు.

నిజాలు భగవంతుడికి మాత్రమే తెలుసునని, భగవంతుడి ఆశీస్సులతో భవిష్యత్తులో అంతా మంచే జరుగుతుందన్నారు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో దేవుడు నిర్ణయిస్తాడని అలాగే జరుగుతుందని అన్నారు. కాగా మోహన్ బాబు తన తనయుడు మంచు విష్ణుతో కలిసి జగన్‌ను, మోపిదేవిని కలిశారు.

రాజమౌళి ఆఫర్ పట్ల చిరంజీవి విముఖత?

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం భారీ ఎత్తున గ్రౌండ్ వర్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చిరు చేయబోయే ప్రతిష్టాత్మక సినిమా కావడంతో సినిమా సంచలనాత్మకంగా ఉండాలని, ఒక మెసేజ్ ఫుల్ గా, తన రాజకీయ కెరీర్ కి ప్లస్సయ్యేలా ఉండటంటో పాటు...అభిమానులకు కావాల్సిన కమర్షియల్ అంశాలు కూడా జోడించి ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

చిరంజీవి 150వ చిత్రానికి దర్శకుడు ఎవరు అని గత కొంత కాలంగా రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీరిలో రాజమౌళి, వివి వినాయక్ పేర్లు బలంగా వినిపించాయి. అయితే ఇటీవల రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి లాంటి పెద్ద హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించను, చిన్న హీరోలతోనే చేస్తా....కానీ చిరంజీవి కోరితే ఆయన 150వ చిత్రానికి స్క్రిప్టు అందిస్తానని బహిరంగ ప్రకటన చేశారు.

రాజమౌళి ఆ ప్రకటన చేసిన అనంతరం మీడియాలో రకరకాల ఊహాగానాలతో కూడిన వార్తలు వినిపించాయి. మగధీర సమయంలో మెగా కుటుంబం చేసిన కొన్ని చర్యల వల్ల ఆయనతో కసి రగిలి చిన్న హీరోలతో సినిమాలు తీస్తూ దర్శకుడిగా తన సత్తా నిరూపించుకుంటున్నారనే వార్తలు ప్రముఖంగా వినిపించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హర్టయిన చిరంజీవి స్క్రిప్టు అందిస్తానని రాజమౌళి చేసిన ఆఫర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించ కూడదని నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

రాజమౌళికి అవకాశం ఇవ్వడం వల్ల ఆయనకు మనమే మరింత స్టార్ ఇమేజ్ తెచ్చిన వాళ్లం అవుతామని, రేపు సినిమా హిట్టయితే రాజమౌళి అందించిన స్క్కిప్టు వల్లనే అయిందని మీడియా కోడై కూస్తుంది....ఇది మెగాస్టార్ ఇమేజ్ పై ప్రభావం పడుతుందనే ఆలోచనలో మెగా వర్గం ఉందట.

కాగా...చిరంజీవి 150వ చిత్రానికి వివి వినాయక్ దర్శకుడుగా ఖరారైనట్లు స్పష్టం అవుతోంది. ఆయన చిత్రానికి పరుచూరి బ్రదర్స్ స్కిప్టు అందించే పనిలో ఉన్నారని, గతంలో చిరంజీవి హిట్ చిత్రాలకు అద్భుతమైన స్క్రిప్టు అందించిన అనుభవం ఉన్న వీళ్లు ఉండగా రాజమౌళి అవసరం లేదనే ఆలోచనలో చిరంజీవి ఉన్నాడట.

24 జులై, 2012

బిగ్ బి ఇంట్లో చోరీ చేస్తూ పట్టుబడ్డ అభిమాని

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో దొంగతనానికి పాల్పడుతూ 20 ఏళ్ల అభిమాని ఒకరు అరెస్ట్ అయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం శుక్రవారం దీపక్ కేవత్ అనే వ్యక్తి అత్యంత భద్రతతో కూడిన అమితాబ్ నివాసం ‘జల్సా'లోకి కాపౌండ్ వాల్ లోని చెట్టు ద్వారా ప్రవేశించి...ఇంట్లోని టాప్ ఫ్లోర్ లో ఉన్న బచన్స్ బెడ్ రూమ్ లోకి చొరబడ్డాడు. బెడ్ రూంలో డెస్కులో ఉన్న రూ. 8వేల నగదును జేబులో వేసుకున్నాడు. ఈలోపే అతన్ని సెక్యూరిటీ గార్డులు పట్టుకుని జుహు పోలీసులకు అప్పగించారు.

పోలీసులు అతన్ని కోర్టులో హాజరు పరుగా...14 రోజుల పోలీస్ కస్టడీ విధించారు. మధ్య ప్రదేశ్ కు చెందిన కేవత్ నెలన్నర క్రితం ఉపాధి కోసం ముంబై వచ్చాడు. రైల్వే ఫ్లాట్ ఫారమ్ పైనే ఉంటూ ఏదైనా పని కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అతను అమితాబ్ ఇంట్లోకి కేవలం దొంగతనం కోసమే వచ్చాడా..? ఇంకేమైనా కారణతో వచ్చాడా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ విషయమై అమితాబ్ తన బ్లాగులో పేర్కొంటూ...‘ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మా ఇంట్లోకి చొరబడి పట్టుబడ్డాడు. ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. మా ఇంట్లోని మోస్ట్ సెన్సిటివ్ ఏరియాలోకి వచ్చాడు. ఇంత భద్రత ఉన్నా అతనెలా వచ్చాడు' అంటూ భద్రత ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలియగానే అమితాబ్ అభిమానులంతా ఒక్కసారిగా నివ్వెర పోయారు. తమ అభిమాన స్టార్ ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తి సకాలంలో పట్టుబడ్డాడు కాబట్టి ఫర్వలేదు కానీ...ఏమైనా అనుకోని సంఘటన జరిగితే పరిస్థితి ఏమిటి అని భద్రత ఏర్పాట్లపై తమ అసంతృప్తి వెలుబుచ్చుతున్నారు.

మీడియా, పవన్ కళ్యాణ్ మధ్య తగువేంటి?

హైదరాబాద్:మొదటి నుంచీ పవన్ కళ్యాణ్ మీడియాను దూరం పెడుతూనే వస్తున్నారు. తన సినిమా హిట్టైనా, ప్లాపైనా మీడియాకు ఇంటర్వూలు ఇవ్వరు. గబ్బర్ సింగ్ లాంటి పెద్ద విజయం సాధించిన తర్వాత కూడా ఆయన మీడియా ఇంటర్వూలకు చాలా దూరంగా ఉండిపోయారు. ఆయనే స్వయంగా ఓ ఇంటర్వూ ఎరేంజ్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసి మీడియా వారికి పంపారు కానీ మీడియాతో స్వయంగా ఆయన ఇంటరాక్ట్ కాలేదు. ఇది టీవీ ఛానెల్స్ కు మింగుడు పడని విషయం. చాలా టీవీ ఛానెల్స్ ఆయన ఇంటర్వూ కోసం పీఆర్వోల మీద,మేనేజర్ల మీద ప్రెజర్ తెచ్చినా ఫలితం లేకుండా పోయింది.

రీసెంట్ గా తెలుగు ఓ పాపులర్ టీవీ ఛానెల్ ఆయన ఇంటర్వూ కోసం శత విధాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఉపయోగం లేదు. దాంతో అసలు పవన్ కళ్యాణ్ ఎందుకని మీడియాకు దూరం ఉంటారు. ఆయన తోటి హీరోలు మీడియాకు కంటిన్యూగా ఇంటర్వూలు ఇస్తూంటే ఆయన ఒక్కసారి కూడా మీడియా ముందుకు రావటానికి ఎందుకు ఇష్టపడరనేది చర్చనీయాంసంగా మారింది. ప్రస్తుతం మీడియా పై ఆయన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం చేస్తున్నారు. అందులో మీడియా పై సెటైర్స్ ఉంటాయని చెప్తున్నారు.

పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రం నిమిత్రం పద్మాలయా స్టూడియోలో భారి సెట్ వేస్తున్నారు. ఓ స్పెషల్ న్యూస్ టీవీ ఛానెల్ సెట్ ని అక్కడ వేసారు. ఈ నెల 11 నుంచి 17 వ తేదీ వరకూ ఇక్కడ షూటింగ్ జరగనుంది. ఇక సినిమాలో వచ్చే కీ సీన్స్ మొత్తం ఇక్కడే షూట్ చేయనున్నారని సమాచారం.

అలాగే పవన్ కళ్యాణ్ వేల మంది జనాల్ని కలసే సీన్స్ కూడా ఇక్కడే షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు పవన్ ఫ్యాన్స్ ని పిలిచి ఆ సీన్స్ షూట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు. అలాగే 'గబ్బర్‌సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. వచ్చే అక్టోబర్‌ 18న దీనిని విడుదల చేయడానికి పూరి జగన్నాథ్‌ ప్లాన్‌ చేశాడు.